జూన్ 25, 2025 తేదీకి 21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ ప్రకటనకు 50 ఏళ్లు నిండుతాయి. తిరిగి చూస్తే, ఇందిరా గాంధీ ఎన్నికల దుష్ప్రవర్తనపై న్యాయపరమైన తీర్పు తర్వాత, ప్రధానమంత్రిగా పూర్తి కార్యనిర్వాహక అధికారాలను కొనసాగించడానికి ఆమె చివరి ప్రయత్నంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లుగా చూడవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే, ఎన్నికల కమిషన్ కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క అనుబంధంగా లేదా సాధనంగా మారిన నేటి ఫాసిస్ట్ పాలనలో, న్యాయవ్యవస్థ నుండి అటువంటి తీర్పు రావటం దాదాపు అసాధ్యం. మహారాష్ట్ర ఎన్నికలలో అపూర్వమైన రిగ్గింగ్ కు పాల్పడిన ఆరోపణల నుండి ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించడం పూర్తిగా వ్యక్తిగత కారణాల కోసం మాత్రమే. అంటే ప్రధానమంత్రిగా కొనసాగడానికి చేసిన రాజ్యాంగ నేరం తక్కువ చేయటం ఇక్కడ ఉద్దేశం కాదు. అత్యవసర పరిస్థితి ముసుగులో, ఇందిర కమ్యూనిస్ట్ విప్లవకారులను మరియు ఆమె రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టవచ్చు; పత్రికలపై సెన్సార్షిప్ విధించవచ్చు; ప్రాథమిక హక్కులను నిలిపివేయవచ్చు; నేరారోపణల నుండి తనకు తానుగా రాజకీయ బలం పుంజుకోవటానికి, శక్తిని కూడగట్టుకోవటానికి ప్రయత్నించవచ్చు. 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ఉపసంహరించుకునే వరకు, ఒక ‘సమూహం’తో కలిసి, ఇందిర ఒక తరహా డిక్రీ ద్వారా పాలించింది. భారతదేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చింది. అయితే, విస్తారమైన భారతీయ సమాజంపై పాలన పట్టు సడలడం మరియు ప్రజాదరణ పొందిన మరియు సామాజిక మద్దతు లేకపోవడం దృష్ట్యా, ఆమె దాదాపు రెండు సంవత్సరాల తరువాత అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఇది పాలక కాంగ్రెస్ పతనానికి దారితీసింది!
అయితే, ఎప్పటిలాగే, భారతదేశంలోని విస్తృత రాజకీయ వర్ణపటం ఒకవైపు తీవ్రవాద ఆర్ఎస్ఎస్/ బిజెపి ఫాసిస్టుల నుండి మరోవైపు సామాజిక-ప్రజాస్వామ్య సిపిఎం (దీనిని తరచుగా ఫాసిజం యొక్క క్షమాపణలు అని పిలుస్తారు) వరకు, అత్యవసర పరిస్థితిని ‘ఫాసిజం’తో గుర్తించే వారి ప్రామాణిక కథనాన్ని సమర్థిస్తున్నారు. మరియు, ప్రతి సంవత్సరం జూన్ 25ని రాజ్యాంగ హత్యా దినంగా(‘సంవిధాన్ హత్య దివస్’గా) పాటించే బిజెపి ప్రభుత్వం, పార్లమెంటును కేవలం భవనంగా ఆకారంగా మాత్రమే ఉంచి లేదా పార్లమెంటుని ప్రేక్షకుడిగా ఉంచడం ద్వారా రాజ్యాంగం యొక్క స్వభావాన్ని మరియు నిర్మాణాన్ని ఇప్పటికే బలహీనపరిచింది లేదా మార్చింది.ఇది ఇందిరా ప్రభుత్వం 21 నెలల అత్యవసర పరిస్థితిలో సాధించలేకపోయింది. నిస్సందేహంగా, అత్యవసర పరిస్థితిని ఫాసిజంతో సమానం చేయడం ద్వారా, ఫాసిస్టులు మరియు వారి క్షమాపణ చెప్పేవారు, వేర్వేరు ధోరణుల నుండి వచ్చినప్పటికీ, ఫాసిజాన్ని దుర్మార్గపు కోణం నుండి రాజకీయం నుండి తొలగిస్తున్నారు. దీని ఫలితం, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు దీర్ఘకాలిక ఫాసిస్ట్ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్, సైద్ధాంతిక-రాజకీయ గురువు అయిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రస్తుత భారతీయ ఫాసిస్ట్ పాలన యొక్క భయానక పరిస్థితులను కప్పిపుచ్చడంగా మనం దీనిని చూడవచ్చు.
ఇది వివిధ స్థాయిలలో చాలా సందర్భాలలో చర్చించబడిన అంశం కాబట్టి ఇందిరా స్వల్పకాలిక అత్యవసర పరిస్థితి లేదా నిరంకుశ పాలన ఒక శతాబ్దం పాటు ప్రపంచ స్థాయిలో దాని పుట్టుక మరియు పరివర్తనపై ఒక లక్ష్యం చారిత్రక దృక్పథం నుండి ఫాసిజం కాదనే వైఖరిని పునరుద్ఘాటించడానికి మాత్రమే ఈ గమనికను మీ ముందు పెట్టడం జరిగింది. బదులుగా, రెండు సంవత్సరాల అత్యవసర పరిస్థితిని ఫాసిజంతో సమానం చేయడం, దాని భౌతిక మరియు సైద్ధాంతిక అవసరాలను పూర్తిగా విస్మరించడం, చాలా ఆత్మాశ్రయమైనది. సరైనది కాదు. ఉపరితలం మరియు అర్థవంతమైన సమీక్ష లేదా మూల్యాంకనం లేనిది. సారాంశంలో, ప్రతిచోటా ఫాసిజం యొక్క భౌతిక ఆధారం అత్యంత అవినీతి మరియు అత్యంత ప్రతిచర్యాత్మక కార్పొరేట్ ఆర్థిక సామ్రాజ్యం, ఇది తీవ్ర మైన- దుర్మార్గమైన మితవాద ఫాసిస్ట్ పాలనతో విలీనం అవుతుంది. అయితే, దేశాల చారిత్రక మరియు సామాజిక నిర్మాణాలను బట్టి, కమ్యూనిజం వ్యతిరేకత మరియు ఇస్లామోఫోబియా ( ప్రచ్చన్న లేదా కోల్డ్ యుద్ధానంతర నయా ఉదారవాదం కింద) తో పాటు ఫాసిజం యొక్క సైద్ధాంతిక ఆధారం దేశం-నిర్దిష్టమైనదిగా ఉన్నది. అంటే, భారతదేశంలో మనువాద హిందూత్వం లేదా ‘రాజకీయ హిందూయిజం’, అమెరికాలో సువార్తికవాదం (ఇవాంజికల్ క్రిస్టియానిటీ), ఐరోపాలో జెనోఫోబియా, జాతి-జాతీయవాదం మరియు నయా-నాస్తికత్వం, ఇజ్రాయెల్‌లో జియోనిజం, మధ్యప్రాచ్యంలో రాజకీయ ఇస్లాం మరియు ఆసియాలో నయా-బౌద్ధం మొదలైనవి దేశాల నిర్దిష్ట పరిస్థితిని బట్టి నేటి ఫాసిజం (లేదా నవ-ఫాసిజం) యొక్క సైద్ధాంతిక ఆధారాన్ని ఏర్పరుచుకున్నాయి.
ఖచ్చితంగా చెప్పాలంటే, నేటి భారత ఫాసిస్ట్ పాలనలా కాకుండా, దాని రాజకీయ-ఆర్థిక పునాది అత్యంత దిగజారిన మరియు క్షీణిస్తున్న ఆశ్రిత పెట్టుబడి దారి, మరియు సైద్ధాంతిక ఆధారం మనువాద హిందూత్వం, దీనికి ముస్లింలు మొదటి శత్రువు. ఇందిరా గాంధీ నిరంకుశ పాలనలో ఫాసిజం యొక్క ముఖ్యమైన మరియు అత్యంత అవసరమైన భౌతిక-సైద్ధాంతిక ఆధారం లేదు. ఉదాహరణకు, నెహ్రూవియన్ రాష్ట్ర నేతృత్వంలోని అభివృద్ధి నమూనాలో భాగమైన బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు( ప్రివీ పర్స్ రద్దు), ఎం ఆర్ టి పి మరియు విదేశీ ఆర్థిక క్రమబద్ధీకరణ చట్టం (ఫెరా)వంటి చట్టాలు మరియు ఆమె “గరీబీ హటావో” నినాదం వంటి ప్రగతిశీల నినాదాల చొరవలు భారత కార్పొరేట్ పెద్ద బూర్జువా యొక్క తీవ్ర- మితవాద-అమెరికన్ అనుకూల వర్గాలను ఇందిరా గాంధీ నుండి పూర్తిగా దూరం చేశాయి. దీని వల్ల ఆమె రెండేళ్లలోపు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకోవలసి వచ్చింది. మరియు, 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇందిరా పాలన తిరోగమనం వైపు నడిచింది . మరియు అమెరికా (యూఎస్)-నియమాలు ప్రకారం, ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ( ఐ ఎం ఎఫ్) యొక్క అత్యంత కఠినమైన, తీవ్ర- మితవాద, నయా ఉదారవాద షరతులకు లొంగిపోయింది. మరోవైపు ‘మృదువైన-హిందూత్వ’ ధోరణిని స్వీకరించి, మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ (ఆర్ఎస్ఎస్ )తో రాజీ పడింది. ఖచ్చితంగా చెప్పాలంటే, అత్యవసర పరిస్థితి మరియు అత్యవసర పరిస్థితి తర్వాత ఇందిరా గాంధీ విధానాలు రెండూ కాంగ్రెస్ క్షీణత దశకు పునాదులు వేసాయి. ఇది అధికార బదిలీ తర్వాత పావు శతాబ్దానికి పైగా దేశవ్యాప్త పాలక పార్టీగా ఉంది.
అత్యవసర పరిస్థితి నుండి అంతిమంగా లాభపడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్)
భారతదేశంలోని ‘పాత పార్టీ’ అయిన కాంగ్రెస్ క్షీణత దశను అత్యవసర పరిస్థితి ప్రారంభించినప్పటికీ, ఆర్ఎస్ఎస్ సాపేక్ష అస్పష్టత నుండి రాజకీయ వెలుగులోకి అకస్మాత్తుగా మరియు నాటకీయంగా ఒక వెలుగు వెలగటానికి, అధికార ఉత్సవాలు జరపడానికి అదే అత్యవసర పరిస్థితి దోహదపడింది. సంక్షోభాలను అవకాశాలుగా మార్చడంలో ఫాసిస్టులు చాలా నైపుణ్యం కలిగి ఉన్నారనే సూక్తి ఆర్ఎస్ఎస్ విషయంలో చాలా అనుకూలంగా ఉన్నది. మోడీ మరియు హిందూత్వ నాయకులు ఎల్లప్పుడూ అత్యవసర పరిస్థితిని ‘చీకటి కాలం’గా అభివర్ణిస్తున్నప్పటికీ, అది ప్రజలకు నిజం.అదే ఆర్ఎస్ఎస్ కి దేవుడిచ్చిన అవకాశం. ఇది రాజకీయ ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించడానికి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు దీర్ఘకాలిక ఫాసిస్ట్ సంస్థగా రూపాంతరం చెందడానికి పరిస్థితులను సమకూర్చుకోవటం ద్వారా నిర్దేశించింది. స్పష్టంగా, ఇండో-సోవియట్ ఒప్పందం మరియు “సామాజిక-సామ్రాజ్యవాద” సోవియట్ యూనియన్‌తో సన్నిహిత పొత్తు నేపథ్యంలో, తరువాతిది అత్యవసర పరిస్థితిని గట్టిగా సమర్థించింది. మరోవైపు, మరియు చాలా తార్కికంగా, అమెరికా మేధావులు(థింక్-ట్యాంకులు) మరియు పాశ్చాత్య సామ్రాజ్యవాద వర్గాలు అత్యవసర పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించాయి. తత్ఫలితంగా, పార్లమెంటరీ ఇండియన్ లెఫ్ట్ అత్యవసర పరిస్థితిని సమర్థించేవారు (అప్పటి సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ పి. సుదరయ్య రాజీనామా చేశారు), పాశ్చాత్య మీడియా మద్దతుతో, అమెరికన్ అనుకూల ఆర్ఎస్ఎస్ అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించడంలో ముందంజలో ఉంది. ఇది దాని నిషేధానికి దారితీసింది. అయితే ఈ ప్రక్రియలో దాని ప్రొఫైల్ మరియు విస్తరణను గణనీయంగా పెంచుకున్నది. ఆ వివరాల్లోకి వెళ్లడం ఇక్కడ ఉద్దేశించబడనప్పటికీ, కొంతకాలం తర్వాత, దాని చీఫ్ దేవరాస్ నేతృత్వంలో, ఆర్ఎస్ఎస్ ఇందిరా పాలనతో రాజీ పడింది. ప్రభుత్వానికి బేషరతుగా ఇచ్చిన హామీల ఆధారంగా, పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు జైలు నుండి బయటకు వచ్చారు, అయినప్పటికీ దాని రహస్య కార్యకలాపాలను మరింతగా మరియు విస్తృతం చేస్తూనే, కమ్యూనిస్ట్ విప్లవకారులపై నిషేధం కొనసాగింది. అత్యవసర పరిస్థితి తర్వాత, జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్న 2 సంవత్సరాల కాలంలో, అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్ర మంత్రులు అయ్యారు. ఆర్ఎస్ఎస్ తన హిందూత్వ ఎజెండా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. జనతా పాలన పతనం తరువాత, ఆర్ఎస్ఎస్ జనసంఘ్ స్థానంలో బిజెపిని తన కొత్త రాజకీయ సాధనంగా మార్చుకుంది. రెండు దశాబ్దాల వ్యవధిలో, వాజ్‌పేయి నేతృత్వంలో మొదటి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది .
ఈ వాదన యొక్క ఫలితం ఏమిటంటే, మొత్తం సంఘ్ పరివార్ మరియు అత్యవసర పరిస్థితిని సమర్థించిన వారితో సహా మొత్తం ఉదారవాదుల సమితి భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో “చీకటి కాలం”గా వర్ణించిన అత్యవసర పరిస్థితిని స్మరించుకోవడం ఒక మళ్లింపు వ్యూహం లేదా నేటి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఫాసిజం యొక్క భయానక పరిస్థితులను కప్పిపుచ్చడానికి. ఇందిరా అత్యవసర పాలన వలె కాకుండా, నేడు తన రాజకీయ సాధనం బిజెపి ద్వారా రాష్ట్ర అధికారాన్ని నియంత్రించే ఆర్ఎస్ఎస్, వీధి శక్తిని కూడా నియంత్రిస్తోన్నది; మరియు ఆర్ఎస్ఎస్ దాని గొడుగు కింద ఉన్న లెక్కలేనన్ని బహిరంగ మరియు రహస్య సంస్థల ద్వారా దేశంలోని మొత్తం సూక్ష్మ మరియు స్థూల ప్రదేశాలపై తన పట్టును కలిగి ఉంది. కార్పొరేట్-హిందుత్వ ఫాసిస్ట్ సామ్రాజ్యాలు ఇప్పటికే పౌర పరిపాలన, సైనిక, న్యాయవ్యవస్థ, విద్య, సంస్కృతి, సైన్స్, పరిశోధన మరియు చరిత్ర రచనలలోకి చొచ్చుకుపోయాయి. మరియు మెజారిటీ హిందూ రాష్ట్ర స్థాపన అనే ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోతున్న ఫాసిస్ట్ పాలన, ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోన్నది. ఇక్కడ దళితులు మరియు మహిళలు వంటి అణగారిన కులాల నుండి వచ్చిన శ్రామిక ప్రజలలో ఎక్కువ మందిని ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతిక మార్గదర్శకమైన మనుస్మృతి సిద్ధాంతాల ప్రకారం మానవాతీతంగా ఖండిస్తారు.
మరియు, ఫాసిస్ట్ మోడీ పాలన యొక్క తీవ్ర అతి మితవాద, కార్పొరేట్ అనుకూల విధానాల కింద, భారతదేశ సంపద మరియు వనరులను అదానీ మరియు అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ-కార్పొరేట్ బిలియనీర్లు (ఆశ్రిత పెట్టుబడిదారీ శతకోటీశ్వరులు) మరియు ప్రపంచ బహుళజాతి సంస్థలు మింగేస్తున్నాయి. బిలియనీర్ల (శతకోటీశ్వరులు)సంఖ్య పెరుగుతుండగా మరియు వారి సంపద కేటాయింపు ఆకాశాన్ని అంటుతుండగా, ప్రపంచంలోని 50 శాతానికి పైగా పేదలు నివసిస్తున్నారు. భారతదేశం నిరుద్యోగులు మరియు అనధికారిక కార్మికుల అతిపెద్ద సమూహం నివసించే అత్యంత అసమాన మరియు అవినీతి దేశాలలో ఒకటిగా మారింది. ఒక దశాబ్దానికి పైగా మోడీ పాలన ద్వారా అమలు చేయబడిన రాజ్యాంగ సవరణలు మరియు క్రూరమైన చట్టాల శ్రేణి ఇప్పటికే రాజ్యాంగం యొక్క స్వభావాన్ని మరియు నిర్మాణాన్ని మార్చాయి, అదే సమయంలో ప్రజలు కష్టపడి సంపాదించిన ప్రజాస్వామ్య హక్కులను లాక్కున్నాయి. ఈ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అసమ్మతి, నిరసనలు మరియు వ్యతిరేకత దేశ వ్యతిరేక లేదా చట్టవిరుద్ధమైనవిగా ముద్ర వేయబడ్డాయి.
ముగింపుగా, అత్యవసర పరిస్థితి 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, అన్ని ఫాసిస్ట్ వ్యతిరేక మరియు ప్రజాస్వామ్య శక్తులు అత్యవసర పరిస్థితిని ఫాసిజంతో సమానం చేయటం లేదా ఆర్ఎస్ఎస్ ఫాసిజాన్ని అప్రకటిత అత్యవసర పరిస్థితిగా గుర్తించే మళ్లింపు వ్యూహంలో , ఆలోచనలో, ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలి.
పిజే జేమ్స్, ప్రధాన కార్యదర్శి సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్.
న్యూఢిల్లీ.
తెలుగు స్వేచ్ఛానుసరణ:* మన్నవ హరిప్రసాద్*, పొలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్ )రెడ్ స్టార్.,
82477 28296.
mannavahariprasad@gmail.com
