కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహి కుసిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు తెలియజేస్తున్నది!
కొల్లిపర వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి సిపిఐ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ .
సత్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, కులరహిత, మతరహిత, వర్గ రహిత సమాజం కోసం పోరాడి అమరుడైన కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరి కామ్రేడ్ సురేఖ ఈరోజు అమరులైనారు. జయ భారత జనని నమో పతిత పావని , ఆతులిత హిమ శిఖరాలే నీదు రత్న కిరీటం, మా భారత జాతి కెల్ల తగు రక్షక కవాటం , అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని పొగుడుతూ , శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని తెలుగు నేలలో ఊరు వాడ జముకల కథ ద్వారా ప్రచారం గావించి,ఎందాక నేస్తం అందాక వస్తాం అంటూ శ్రీకాకుళం విప్లవోద్యమంలో పెన్నుగన్ను పట్టి పోరాడిన కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి గారి సహచరి కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహి గారు ఈరోజు తుది శ్వాస విడిచారని తెలియజేయుటకు విచారిస్తున్నాము.
వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకు మా సానుభూతిని తెలియజేస్తున్నాము. మరొకసారి కామ్రేడ్ సురేఖ కు విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాము!
కొల్లిపర వెంకటేశ్వరరావు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి,
సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్
24-7-2025,
గుంటూరు, అమరావతి
