* సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి శ్రీజొన్నకూటి వెంకటేశ్వరరావు, నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కో- కన్వీనర్ శ్రీ ధనకుదురం రంగనాథం , తదితరుల డిమాండ్!*
జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం లో ఉన్న బంజరు సీలింగ్ భూమిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏలూరు జిల్లా కలెక్టర్ వారికి
ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సీలింగ్ భూములను స్వాధీనం చేసుకొని భూమిలేని దళిత పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రైతు- కూలీ సంఘం ఆధ్వర్యంలో 28- 7 -2025 సోమవారం స్థానిక జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ ఆఫీసు దగ్గర ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో భూమిలేని నిరుపేదలు వందలాదిమంది పాల్గొన్నారు.
ఈ ధర్నాలో సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
ప్రధాన కార్యదర్శి శ్రీ జొన్నకూటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంగిడిగూడెం సీలింగు భూములు విషయంలో జరిగిన అక్రమాలపై ,అవినీతిపై కోర్టుధిక్కార నేరాలపై రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు డివిజన్ మెజిస్ట్రేట్ హోదాలో క్షేత్రస్థాయి విచారణ జరిపి ,ఆ ప్రకారం సీలింగ్ భూమిని పేదలకు పంచాలని శ్రీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కో- కన్వీనర్( అఖిల భారత విప్లవ రైతు సంఘం (ఏఐకేకేఎస్ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ధనకుదరం రంగనాథం, ఆదివాసీ భారత్ మహాసభ (ఏబీఎమ్) రాష్ట్ర కార్యదర్శి శ్రీ మడకం రామన్న,
నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మందపల్లి రాజు, రావు,పి. ఏసు ,ఏ. వెంకటేశ్వరరావు ,జి .శ్యామల, పి రవి, తదితరులు మాట్లాడుతూ పంగిడిగూడెం సీలింగ్ భూములు పేదలకు పంచకపోతే భూమిలేని నిరుపేదలే స్వాధీనం చేసుకుంటారని దానికి పూర్తి బాధ్యత రెవిన్యూ పోలీస్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇట్లు,
ఉద్యమాభివందనలతో,
జొన్నకూటి వెంకటేశ్వరరావు,
950 5931 254.
జంగారెడ్డిగూడెం
28 -7- 2025
