Home » 2025 ఆగస్టు 13న జరుగనున్న అఖిల భారత నిరసన కార్యక్రమానికి  సంఘీభావంగా పాల్గొందాం!

2025 ఆగస్టు 13న జరుగనున్న అఖిల భారత నిరసన కార్యక్రమానికి  సంఘీభావంగా పాల్గొందాం!

సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్, కేంద్ర కమిటీ

by admin

2025 ఆగస్టు 13న జరుగనున్న అఖిల భారత నిరసన కార్యక్రమానికి  సంఘీభావంగా పాల్గొందాం!

సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్, కేంద్ర కమిటీ

ఒకవైపు మోడీ ప్రభుత్వం ‘స్వాతంత్ర్య దినోత్సవాన్ని’ ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతూనే, మరోవైపు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద శక్తుల ఆజ్ఞలకు లొంగుబాటుగా  వ్యవహరిస్తున్నది. భారతదేశం రష్యా నుండి చమురు దిగుమతిపై ట్రంప్ పెట్టిన పెనాల్టీ టారిఫ్ బెదిరింపులపై ప్రభుత్వం తీసుకున్న మెతక వైఖరిలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదే ట్రంప్, భారత ఎగుమతులపై 25% సుంకాన్ని విధించాలనే తన సంకల్పాన్ని కొనసాగిస్తూ, అమెరికా వ్యవసాయ సంస్థలకు భారతలో మార్కెట్‌ను తెరవాలని కోరుతున్నాడు.

అలానే, మోడీ ప్రభుత్వం సంతకం చేసిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వర్తక ఒప్పందం (CETA) ద్వారా బ్రిటన్‌కి చెందిన పాల, వ్యవసాయ మరియు ఆరోగ్య ఉత్పత్తుల కోసం భారతదేశం ఒక డంపింగ్ గ్రౌండ్‌ ( ఇబ్బడి ముబ్బడిగా  అమెరికా నుంచి వచ్చే  వస్తువులచెత్త కుప్ప లేదా వారి ఉత్పత్తులు అమ్మే కేంద్రంగా)గా మారబోతుంది. దీని ఫలితంగా పాల, మాంసం మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో భారత మార్కెట్లు నిండిపోతాయి. ఇప్పటికే వ్యవసాయంలో ఇన్‌పుట్ మరియు ఔట్‌పుట్ మార్కెట్లపై కార్పొరేట్ నియంత్రణతో కష్టపడుతున్న రైతుల జీవనోపాధి పూర్తిగా నాశనం కానుంది.

ఈ చర్యలు కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలకు హానికరమైనవైనప్పటికీ, ఇవి ఒక్కసారిగా జరిగిన లేదా ఒంటరి పరిణామాలు కావు. ఇది గత పదిహేనేళ్ళుగా ఆర్‌.ఎస్.ఎస్ ఆధ్వర్యంలోని ఫాసిస్టు మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్పొరేట్ అనుకూలమైన,  మితవాద ఆర్థిక విధానాల లో భాగమే. ఇవన్నీ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ మరియు డబ్ల్యూటీవో వంటి సామ్రాజ్యవాద అనుకూల సంస్థల శక్తుల ఆజ్ఞలతో అమలవుతున్నాయి.

‘విశ్వగురు’, ‘వికసిత భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి తప్పుడు జాతీయత” నినాదాల కింద, అదానీ, అంబానీ వంటి (ఆశ్రిత పక్షపాత) క్రోనీ క్యాపిటలిస్టులతో చేతులు కలిపి, మోడీ ప్రభుత్వం కార్మిక, పన్ను, పర్యావరణ సంబంధిత విధానాలను ప్రజలపై లాఘవంగా అమలు చేస్తోంది. ప్రజలు ఇప్పటికే తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానత, దుర్భిక్షం మరియు ఫాసిస్టు అణచివేతలతో నష్టపోతున్నారు.

ఈ నేపథ్యంలో, మేము కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు మరియు మతపరంగా, సామాజికంగా బాధితులైన ముస్లింలు, దళితులు, మహిళలు మరియు ప్రజాస్వామ్యవాద శక్తులందరినీ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా “భారతదేశాన్ని విడిచిపెట్టు – మళ్లీ!” అనే నినాదంతో పాల్గొనమని పిలుపునిస్తున్నాము.

సామ్రాజ్యవాదులు మరియు బహుళజాతి సంస్థలు భారతాన్ని విడిచిపెట్టి పోవాలి!
కార్పొరేట్-ఫాసిజం మరియు సామ్రాజ్యవాదం నశించాలి!

కేంద్ర కమిటీ.
సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్

న్యూఢిల్లీ
05.08.2025(MHP)

Related Posts

Leave a Comment