39
అక్రమ అరెస్టులపై సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ఖండన
ఒడిశాలోని కార్పొరేట్ అనుకూల, ఫాసిస్ట్ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం పార్టీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రమిలా, టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శంకర్ మరియు 17 మంది ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టియుసిఐ )నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ తీవ్రంగా ఖండిస్తోన్నది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరుగుతున్న అఖిల భారత కార్మికుల సమ్మెలో భాగంగా ప్రచారం చేస్తున్నప్పుడు కామ్రేడ్లను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు. అరెస్టు చేసిన కామ్రేడ్లందరిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్
