Home » ఆదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి! పాత ఎలక్ట్రిసిటీ మీటర్ల ని కొనసాగించండి!

ఆదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి! పాత ఎలక్ట్రిసిటీ మీటర్ల ని కొనసాగించండి!

by admin

ఆదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి! పాత ఎలక్ట్రిసిటీ మీటర్ల ని కొనసాగించండి!

ధనకుదరం రంగనాథం- రాష్ట్ర కో కన్వీనర్ నవ్యాంధ్రప్రదేశ్  రైతు- కూలీ సంఘం(ఎఐకే కే యస్- అనుబంధం)

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం 30.7.25న ఎర్రగుంటపల్లి గ్రామంలో “ఆదాని మీటర్లు వద్దు- పాత మీటర్లే ఉంచాలని” పెంచిన చార్జీలు తగ్గించి పేదవాళ్లను, రైతులను ఆదుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు  ప్రజలకు  వివరించి చెబుతూ సంతకాల సేకరణ  కార్యక్రమం నిర్వహించారు .  ఆదాని స్మార్ట్ మీటర్లు వద్దంటూ సుమారు 430మంది సంతకాలు చేసారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ( ఏఐకే కేఎస్-  అనుబంధం)రాష్ట్ర కో -కన్వీనర్ ధనకుదరం రంగనాథం మాట్లాడుతూ అదాని మీటర్లను కేటగిరి -2 కింద ఇప్పటికే బిగించిన దుకాణా యజమానులకు అధిక బిల్లులు వస్తున్నాయని ,చిల్లర వ్యాపారస్తులు వాపోయారు .గృహ అవసరాల కోసం ఈ అదానీ మీటర్ల ప్రమాదం నుండి బయటపడాలంటే అదానీ విద్యుత్ మీటర్లను అడ్డుకోవాలని బిగించనీయవద్దని తెలిపారు. దేశంలోని పాలక పార్టీలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులను ప్రపంచంలో ధనవంతులుగా ధ్యేయంగా పెట్టుకుని ఈ అదానీ మీటర్లను వినియోగదారులపై అధిక చార్జీలు వసూలు చేసే ఉద్దేశంతో ఈ మీటర్లను బిగించుతున్నారన్నారు. ప్రస్తుత కూటమి పాలకులు కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేసే పద్ధతుల్లో పోటీలు పడి విద్యుత్ వినియోగదారులపై ధరల దాడి చేస్తున్నారని  ఆయన ప్రసంగించారు  .సిపిఐ మండల కార్యదర్శి గురవయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు తొర్లపాటి బాబు, కౌలు రైతుబంధు జిల్లా నాయకులు దంతా కృష్ణ ,మండల రైతు సంఘం నాయకులు మాణిక్యరావు, సిపిఎం కు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Comment