Home » ఫాసిస్టు వ్యతిరేక నాగపూర్ ప్రకటనఫాసిస్టు ఆర్ఎస్ఎస్ /భాజపాలను ఓడించండి! 18వ లోకసభ ఎన్నికల సందర్భంగా *సిపిఐ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ రాజకీయ వైఖరి

ఫాసిస్టు వ్యతిరేక నాగపూర్ ప్రకటనఫాసిస్టు ఆర్ఎస్ఎస్ /భాజపాలను ఓడించండి! 18వ లోకసభ ఎన్నికల సందర్భంగా *సిపిఐ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ రాజకీయ వైఖరి

by admin

ఫాసిస్టు వ్యతిరేక నాగపూర్ ప్రకటన
ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ /భాజపాలను ఓడించండి! 18వ లోకసభ ఎన్నికల సందర్భంగా *సిపిఐ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ రాజకీయ వైఖరి

  • సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్*

[10 మార్చి 2024న నాగ్‌పూర్‌లో జరిగిన  అఖిలభారత ఫాసిస్ట్ వ్యతిరేక   ప్రజా సదస్సు  ఆమోదించిన తీర్మానం ఆధారంగా 18వ భారత పార్లమెంట్ ఎన్నికల పట్ల సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ యొక్క విధానం ]

  1. 10 మార్చి 2024న నాగ్‌పూర్‌లో  సిపిఐ (ఎం.ఎల్) రెడ్‌స్టార్ నిర్వహించిన  అఖిలభారత ఫాసిస్టు వ్యతిరేక ప్రజా సదస్సు, ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో,  భాజపా  /ఆర్ఎస్ఎస్  ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల మతోన్మాద అనుకూల  విధానాలకు వ్యతిరేకంగా  భారత దేశ ప్రజలు ఉద్యమించి  ముందుకు సాగాలని  ఆ సదస్సు విజ్ఞప్తి చేసింది. ఆర్‌ఎస్‌ఎస్-కార్పొరేట్ ఫాసిజం నుండి  భారతదేశాన్ని 18వ పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని దృఢంగా ప్రతిఘటించి ఓడించడం ద్వారా  ముందుకు సాగాలని ఆ సదస్సు విజ్ఞప్తి చేసింది.  ఆర్‌ఎస్‌ఎస్, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు సుదీర్ఘకాలం నడుస్తున్న, తీవ్రవాద, ఫాసిస్ట్ సంస్థ; దాని రాజకీయ సాధనం, బిజెపి ద్వారా, ఇప్పుడు అత్యంత అవినీతిపరులైన కార్పొరేట్-  ఆశ్రిత పెట్టుబడిదారుల(క్రోనీ క్యాపిటలిస్టుల) మద్దతుతో భారత  దేశం యొక్క పగ్గాలను  చేపట్టి పరిపాలిస్తున్నది . తత్ఫలితంగా, పౌర మరియు సైనిక పరిపాలన మరియు న్యాయవ్యవస్థతో పాటు దేశంలోని మొత్తం రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాలతో పాటుగా  నూతన విద్యా విధానం( ఎన్ ఈ పి) ద్వారా కాషాయీకరించబడుతున్న విద్య మరియు శాస్త్రీయ పరిశోధనలతో సహా భారత రాజ్యాధికారం యొక్క అన్ని సంస్థలు ఇప్పుడు  భాజపా /ఆర్ఎస్ఎస్  యొక్క గట్టి పట్టులో ఉన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్  (ఆర్ఎస్ఎస్)  ఇప్పుడు బహుభాషా, బహుళసాంస్కృతిక, బహుళ జాతి మరియు బహుళ-మతాల భారతదేశంపై మెజారిటీ  హిందూ మతాన్ని రుద్ది హిందూ దేశంగా  మార్చే దిశగా  ఉన్మాద వేగంతో ఉన్నది.

2.  దేశంలో వివిధ నివేదికలు వెల్లడించినట్లుగా భారతదేశం  దేశం మొత్తం, మోడీ పాలనలో, సాధారణంగా మైనారిటీలు  రక్షణ లేకుండా ఉన్నారు.  మణిపూర్ మరియు ఇతర ప్రాంతాలలో విపరీతమైన దుర్మార్గమైన దాడులకు గురయ్యారు.  ముస్లింలు అత్యధికంగా  లక్ష్యంగా చేసుకొని పరాయి వారిగా అభద్రతా భావానికి గురవుతున్నారు . వలసరాజ్యాల కాలంలోనే, భారతదేశం యొక్క ప్రధాన శత్రువుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి బదులుగా,  రాష్ట్రీయ స్వయం సేవక సంఘ (ఆర్ఎస్ఎస్) చీఫ్ గోల్వాల్కర్, ముస్లింలను భారతదేశానికి మొదటి శత్రువుగా   ప్రకటించాడు. నేడు, మరోవైపు, ఇస్లాం వ్యతిరేకత లేదా ఇస్లామోఫోబియా ప్రపంచ స్థాయిలో అమెరికా సామ్రాజ్యవాదులు మరియు ఇతర సామ్రాజ్యవాద శక్తుల ఆసరాతో  నయా ఫాసిజం యొక్క సైద్ధాంతిక ప్రాతిపదికగా మారింది. ఈ మొత్తం పరిస్థితిని సమర్థవంతంగా ఉపయోగించుకుని, ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల ప్రకారం, బిజెపి పాలన అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో ముస్లింలను  అణిచివేతకు విచక్షణకు గురి చేస్తుంది; మరియు వారి పట్ల తీవ్ర ద్వేషాన్ని పెంచుతోంది. మరియు  దేశ రాజ్య అధికారం యొక్క అన్ని సంస్థలు ఈ ప్రయోజనం కోసం క్రమపద్ధతిలో ఉపయోగించబడుతున్నాయి. ఇస్లామోఫోబిక్, మెజారిటీ పోలరైజేషన్‌లో భాగంగా భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణ స్వరూపం మరియు లౌకిక స్వభావం కూడా మార్చబడుతున్నాయి.

  1. 2019లో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ (సవరణ) చట్టం ( సిఏఏ) 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించింది. పౌరసత్వానికి మతాన్ని ఒక ప్రమాణంగా చేర్చడం మరియు సాధారణ ఎన్నికల సందర్భంగా దాని వేగవంతంగా అమలు కోసం   పౌరసత్వ సవరణ చట్టం( సిఏఏ)  తాజా నిబంధనలతో తాజా ప్రకటన  చేయటం జరిగింది. ఈ తాజా నిబంధనలలో   ఈ సందర్భంగా 3 పొరుగు దేశాల నుండి 6 ముస్లిమేతర మతాలకు  చెందిన (హిందువులు క్రైస్తవులు జైనులు పారసీకులు బౌద్ధులు సిక్కులు)   వారికి పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ మరియు ముస్లింలను పూర్తిగా మినహాయించే  పౌరసత్వ సవరణ చట్టం  (సి ఏ ఏ)ముస్లింల పట్ల వివక్ష చూపే విధంగా ఐక్యరాజ్యసమితి (యు ఎన్) చేత కూడా   విమర్శించబడింది. అలా చేస్తూనే, అత్యంత పీడించబడుతున్న మైనారిటీలుగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించిన  మయన్మార్ రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదాను కూడా మోదీ ప్రభుత్వం నిరాకరించింది. అదేవిధంగా, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లోని వివిధ శరణార్థి శిబిరాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న శ్రీలంక తమిళ శరణార్థులు కూడా  పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) ప్రకారం పౌరసత్వం పరిధి నుండి మినహాయించబడ్డారు. భారతీయ ఫాసిజంలో మరింత నిర్దిష్టమైన పరిస్థితి ఏమిటంటే, ముస్లిం మైనారిటీ నివాసాలను బుల్‌డోజర్‌తో ధ్వంసం చేయడం, వారిని తరిమివేయడం, దేశవ్యాప్తంగా ఇప్పటికే కాషాయీకరించిన బ్యూరోక్రసీ మరియు పోలీసుల మద్దతుతో  అరాచక గుంపులు వారిపై పురిగోల్పటం జరుగుతున్నది . దళితులపై వివిధ రూపాల్లో హత్యాకాండలతో పాటు కాషాయ-ఫాసిస్ట్ గూండాలు ముస్లింలకు జీవించే హక్కు మరియు జీవనోపాధిని నిరాకరించడం భారతదేశంలో ‘కొత్త సాధారణం’ విధానంగా మారింది.
  2. మోడీ పాలన చేపట్టిన తరువాత చట్టపరమైనపాలనలోనూ మరియు పరిపాలనా కార్యక్రమాల పరంపరలో అనేక విధాలుగా ముస్లిం వ్యతిరేక ధోరణి కనిపిస్తున్నది. 2019లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా  జమ్మూ మరియు కాశ్మీర్(J&K )యొక్క ప్రత్యేక రాజ్యాంగ హోదాను తీసివేస్తూ ఆర్టికల్ 370 రద్దు మరియు డిసెంబర్ 2023లో దానికి సుప్రీం కోర్టు ఆమోదం; కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలోనే రామమందిరాన్ని నిర్మించి, 2024 జనవరిలో ప్రధానమంత్రి స్వయంగా దానిని బాల రాముని ప్రాణ ప్రతిష్ట  చేయడం, తద్వారా భారత రాజ్యాంగంలోని లౌకిక నిర్మాణాన్ని దెబ్బతీయడం,  ఏకీకృత పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్ )ను ప్రకటించడం మరియు బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయడం  మొదలగు అన్ని విషయాలన్నిటిలో ప్రత్యేకంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధంగా  అనేక,ఇతర ఎత్తుగడలతో,  ఆర్ఎస్ఎస్/ భాజపా ఇప్పటికే మెజారిటీ మతతత్వ హిందూ  రాజ్యాన్ని లేదా దేశాన్ని స్థాపించాలనే తమ అంతిమ లక్ష్యానికి పునాదులు వేసారు. అధికారికంగా ప్రకటించడం కోసం, ఇప్పటికే సృష్టించిన ముస్లిం వ్యతిరేక మెజారిటీ పోలరైజేషన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుని, ఎన్నికల కమిషన్‌పై బిజెపి తన నియంత్రణతో, ఇప్పుడు తన ‘మిషన్ 400’ని ప్రకటించింది, అంటే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటులో 400 సీట్లు గెలుచుకోవడం  భాజపా/ ఆర్ఎస్ఎస్ మిషన్ లక్ష్యం గా ఉన్నది.
  3. మనుస్మృతిని భారత రాజ్యాంగంగా అధిరోహించడానికి  రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్ఎస్ఎస్ )గతంలో చేసిన అసంపూర్ణ ప్రయత్నాలు ఇప్పటికే తెలిసు. ఆ విధంగా, రాజ్యాంగ సభ నవంబర్ 1949లో డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ ద్వారా భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్ఎస్ఎస్ ) దాని అధికార పత్రిక( మౌత్ పీస్) ఆర్గనైజర్ ద్వారా, దళితులు మరియు మహిళలతో సహా అణగారిన అట్టడుగు కులాలను అణచివేతకు గురిచేసే మనుస్మృతిని  రాజ్యాంగంగా భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు, ఆర్థిక రిజర్వేషన్ లను ( ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు- ఈ డబ్ల్యూ ఎస్) చొప్పించిన 103వ రాజ్యాంగ సవరణ ద్వారా, మోడీ ప్రభుత్వం ఇప్పటికే రాజ్యాంగం యొక్క స్వభావాన్ని మార్చింది, అది ఆమోదించబడిన సమయంలో కుల ఆధారిత రిజర్వేషన్‌ను ప్రాథమిక లక్షణాలలో ఒకటిగా కలిగి ఉంది. భారతదేశ సంపదలో సింహభాగం, సివిల్ మరియు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ మరియు న్యాయవ్యవస్థలో ఉన్నత పదవులు ఇప్పటికే బ్రాహ్మణీయ ఉన్నత కులాలలోని చిన్న మైనారిటీలచే ఆక్రమించబడినందున, ఆర్థిక రిజర్వేషన్లు ( ఆర్థికంగా వెనుకబడిన కులాలకు లేక వర్గాలకు- ఈ డబ్ల్యూ ఎస్)  ఉన్నత కులాలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఎక్కువ పోస్టులను మంజూరు చేస్తాయి. ఇది మనుస్మృతి సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. ఈలోగా, అణగారిన కులాలు మరియు ప్రజాస్వామ్య శక్తుల పక్షాన అఖిల భారత కుల గణన డిమాండ్‌ను రాష్ట్రీయ స్వయంసేవక సంఘ/ భాజపా  గట్టిగా అడ్డుకుంటున్నాయి.ఇది దేశ రాజకీయ, ఆర్థిక మరియు పరిపాలనా అధికారంపై అగ్రవర్ణ, బ్రాహ్మణుల పట్టును బహిర్గతం చేస్తుంది. ఈ సందర్భంలో, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించి భారత రాజ్యాంగాన్ని మనుస్మృతితో భర్తీ చేయడానికి దారితీస్తుందని ప్రగతిశీల మరియు ప్రజాతంత్ర శక్తులు మరియు అణగారిన  ప్రజల పట్లమంచి ఉద్దేశ్యం ఉన్న అభివృద్ధి కానుక ప్రజలందరిలో  ఉన్న విస్తృతమైన ఆందోళనను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
  4. ఈ విధానాలన్నీ ఫాసిస్ట్ కాషాయ ఎజెండాలో అంతర్భాగం  మాత్రమే కాక మోడీ ప్రభుత్వం యొక్క మితవాద, కార్పొరేట్ అనుకూల ధోరణికి అనుగుణంగా, భూమి, మౌలిక సదుపాయాలు, రవాణా, ప్రజా సేవలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో సహా దేశ సంపద మరియు వనరులు ఎక్కువగా  క్రోనీ క్యాపిటల్ లిస్టులు దోచుకుంటున్నాయి.  ఆశ్రిత పెట్టుబడిదారుల (క్రోనీ క్యాపిటలిస్టుల) వంటి అదానీ-అంబానీ ద్వారా. కార్మిక, పర్యావరణం మరియు పన్నుల సరళీకరణ యొక్క సడలింపు మరియు అనధికారికీకరణకు సంబంధించిన గత 10 సంవత్సరాల మోడీ పాలనలో రూపొందించిన కార్పొరేట్ అనుకూల మరియు నయా ఉదారవాద చట్టాల పరంపర అత్యంత అవినీతి కార్పొరేట్ బిలియనీర్లచే భయంకరమైన స్థాయిలో సంపదను స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. ప్రస్తుతం ఉన్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసి, వాటిని 4 లేబర్ కోడ్‌లుగా మార్చే చర్య భారతీయ కార్మికవర్గం కష్టపడి  పోరాడి సాధించిన సంపాదించిన ప్రజాస్వామిక హక్కులన్నింటినీ తొలగించింది. వీరిలో ఎక్కువ మంది కార్మికులను దోపిడీ చేయబడుతున్నారు. కార్మికుల స్థాయికి దీటుగా మరియు అతి-అధిక- అసంఘటిత/అనధికారిక రంగాలలో దోపిడీ  కార్పొరేట్ వర్గాల ద్వారా తీవ్రతరం చేయబడుతుంది. మోడీ పాలనలో పర్యావరణ చట్టానికి సవరణ తీసుకువచ్చింది.ప్రకృతిని అపరిమిత కార్పొరేట్-దోపిడీని సులభతరం చేయడం కోసం  ఈ సవరణ తీసుకొచ్చింది. భారతీయ కార్పొరేట్ పన్ను రేట్లు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉండగా, నయా ఉదారవాద మరియు తిరోగమన వస్తువుల సేవల పన్నును( జిఎస్‌టిని) అతిగా విధించడం ద్వారా పన్ను భారం అత్యధికంగా శ్రామిక మరియు అణగారిన ప్రజల భుజాలపై న మోపబడుతుంది .  జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, తద్వారా రాజ్యాంగంలో ఏర్పరిచిన విధంగా భారతదేశ సమాఖ్య స్వరూప స్వభావ నిర్మాణాన్ని భాజపా ప్రభుత్వం దెబ్బతీసింది. మరియు  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) ఆదేశాల ప్రకారం మోడీ ప్రభుత్వం రూపొందించిన 3 క్రూరమైన వ్యవసాయ చట్టాలు, రైతుల నుండి వచ్చిన ప్రతిఘటన కారణంగా ఇప్పుడు  నిలుపుదల లో(ఫ్రీజర్‌లో) ఉంచబడినప్పటికీ, భారతీయ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ మరియు ప్రపంచ  వాణిజ్య సంస్థ వ్యవసాయ వ్యాపార ప్రయోజనాలకు  అనుగుణంగా ఉద్దేశించబడ్డాయి.
  5. 2014లో, మోడీ ప్రభుత్వం అవినీతి నిరోధక ప్లాంక్‌తో అధికారంలోకి వచ్చింది. నవంబర్ 2016లో  నల్లధనం వెలికితీత పేరుతో వినాశకరమైన నోట్ల రద్దు, నల్లధనం మరియు అవినీతికి వ్యతిరేకంగా “సర్జికల్ స్ట్రైక్”గా అంచనా వేయబడింది. మరియు ఇది ఉగ్రవాద నిధుల నిర్మూలన మరియు నగదు రహిత లావాదేవీల వైపు అడుగులు వేస్తున్నది. , నిజానికి, కార్పోరేట్-ఫాసిస్ట్ దాడి, శ్రమిస్తున్న ప్రజల ధమనులలో మిగిలి ఉన్న మూలిగలను వాటిని, ముఖ్యంగా అసంఘటిత రంగాలలోని ఒకవైపు మరియు మరోవైపు అపూర్వమైన ‘నల్లధనం  చట్టబద్ధ ధనంగా మార్చుకోవటానికి (తెల్లబడటానికి)’ మార్గం సుగమం చేసింది. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనోపాధికి కోలుకోలేని నష్టం వాటిల్లింది. లక్షలాది ఉద్యోగాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, దేశంలో చెలామణి అవుతున్న నల్లధనం నుంచి ఒక్క రూపాయి కూడా ఈ చర్య ద్వారా   ప్రభుత్వం సమీకరించలేకపోయింది. మరియు డీమోనిటైజేషన్ తర్వాత ఒక సంవత్సరం లోపు, చెల్లనిదిగా మార్చబడిన మొత్తం నగదు తిరిగి సర్క్యులేషన్ ఛానెల్‌లలోకి వచ్చింది.  వీటి మూలమున, భారతదేశం అత్యంత అవినీతి దేశాలలో ఒకటిగా  నేడు కొనసాగుతోంది  అనటానికి  అంబానీ ఆదానీ లాంటి ఆశ్రితపక్షపాత పెట్టుబడిదారుల ఆస్తులు లక్షల కోట్లకు పెరగటమే”క్రోనీ క్యాపిటలిజం” యొక్క అభివృద్ధి చెందుతున్న ఉదాహరణ, కార్పొరేట్లు మరియు పాలక పాలనల మధ్య అపవిత్ర బంధం మూలమున, ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు అన్నీ కూడా కార్పొరేట్-బోర్డు గదులలో తీసుకో బడుతున్నాయి. అయితే  భారత పార్లమెంటు భవనం మరియు కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. ప్రజలను మోసగించడం మోడీ పాలన నిత్య కృత్యమైంది. అత్యంత అవినీతికరమైన కార్పొరేట్ కంపెనీలకు అపరిమిత విరాళాలు ఇచ్చేందుకు వీలు కల్పించిన రాజ్యాంగ విరుద్ధమైన, పారదర్శకత లేని ‘ఎలక్టోరల్ బాండ్స్’ ( ఎన్నికల నిధులు సేకరణకు బాండ్లు)పథకంలో సింహభాగం భాజపా ఖజానాలోకి వెళ్లిపోయిందని సుప్రీంకోర్టు ఇటీవల  ఎన్నికల బాండ్ల చట్ట చర్య ను కొట్టివేసింది. ప్రభుత్వ చర్యను తీవ్రంగా గర్హించింది.
  6. నేడు మోడీ పాలనలో, భారతదేశం ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాలలో ఒకటిగా మారింది. మోడీ ప్రభుత్వం  ఎన్ని బూటకపు ఉచితాలు ఇచ్చినా మరియు ప్రధానమంత్రి హామీలపై  హామీలతో వాక్చాతుర్యంతో  ప్రజానీకాన్ని మభ్యపెట్టలేనిదనేది వాస్తవం. ధనిక మరియు పేదల మధ్య అంతరం ఇప్పటివరకు తెలియని స్థాయికి విస్తరించింది. అగ్రశ్రేణి భారతీయుల ఆదాయ వాటాలో అగ్రశ్రేణి 1 శాతం మంది50శాతం సంపద కలిగి ఉన్నారు. ఇప్పుడు బ్రిటిష్ వలస పాలనలో కంటే ఎక్కువగా ఉంది మరియు మోడినోమిక్స్‌లో దిగువ 50 శాతం ఆదాయం వాటా  1951 లో ఉన్న దాని కంటేతక్కువగా ఉంది. దేశం యొక్క సంపద కేంద్రీకృతమై ఉన్న కార్పొరేట్ క్రోనీ బిలియనీర్లు ఉపాధిని సృష్టించే వాస్తవ ఉత్పత్తిపై తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. కానీ వారు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్ మరియు ఇతర డబ్బు-స్పిన్నింగ్ స్పెక్యులేటివ్ వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారు. ఫలితంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అదనంగా కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ పాలనలో నిరుద్యోగం  అనిశ్చయంగా మారింది. ధరలు, ముఖ్యంగా ఆహారం, ఇంధనం మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, అయితే శ్రామిక మరియు అణచివేతకు గురైన విస్తృత ప్రజానీకం యొక్క నిజమైన ఆదాయాలు మరియు కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది .
  7. ఇటీవలే, ఆరున్నర దశాబ్దాల నాటి ప్రణాళికా సంఘం స్థానంలోకి వచ్చి, కార్పొరేటీకరణను సులభతరం చేసే విధాన మార్గదర్శ మేధా సంస్థగా( థింక్ ట్యాంక్‌గా) పని చేస్తున్న నీతి ఆయోగ్, కేవలం 5 శాతం కంటే తక్కువ భారత ప్రజలు మాత్రమే దారిద్రరేఖకు దిగువున  అనే వాదనతో ముందుకు వచ్చింది. భారతీయులు ఇప్పుడు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. కానీ, దక్షిణాసియాలో ని జనాభాలో లో 74 శాతం మంది భారతీయ జనాభా  ప్రజలకు  కనీస పోషకాహారాన్ని పొందలేకపోతున్నారని ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) సూచిక  ప్రకారం తాజా  ఐక్యరాజ్యసమితి ( యు ఎన్) నివేదిక నేపథ్యంలో మోడీ పాలన యొక్క ఈ వాదనను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అందుకని,  మోడీపాలన కోరుకున్న విధంగా పేదరికాన్ని అంచనా వేయడానికి మోడీ ప్రభుత్వం తన వద్దకు అనువైన గణాంకవేత్తలను నియమించడం ద్వారా ఉపయోగించే పద్దతి లోపభూయిష్టంగా ఉంది.  అది అంతర్జాతీయంగా ఆమోదించబడిన నిబంధనలకు అనుగుణంగా లేదు. మరియు అంతర్జాతీయ నివేదికలు పోషకాహారాన్ని ప్రధాన ప్రమాణంగా తీసుకుంటుంది. 2023  భౌగోళిక పేదరిక సూచిక(గ్లోబల్ పావర్టీ ఇండెక్స్) ప్రకారం, భారతదేశం మొత్తం 125 దేశాలలో 111వ స్థానంలో ఉంది.  ప్రపంచంలోని 53 శాతం “అతి పేదిరికం”తో, భారతదేశం “ప్రపంచ పేదరికం యొక్క కోట”గా వర్గీకరించబడింది. ఖచ్చితంగా చెప్పాలంటే, పెరుగుతున్న అసమానత,  విపరీతమైన నిరుద్యోగం, జీవనోపాధి కోల్పోవడం, ఆవాసాల నుండి, నివాస ప్రాంతాల నుండి స్థానభ్రంశం మరియు  విపరీతమైన ఆకలితో  బాధపడుతున్నట్లుగా,వ్యక్తమవుతున్నట్లుగా, శ్రామిక వర్గం, రైతులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు మరియు మతపరమైన మైనారిటీలతో సహా అణచివేతకు గురైన భారతీయులలో అత్యధికులు జీవితాలను వెల్లదీస్తున్నారు . మరియు అధికారిక ఏజెన్సీల ద్వారా మోసపూరితంగా   పేదరిక గణాంక వివరాలు ఎంతకప్పిపుచ్చబడినప్పటికి  భారతదేశము సంపూర్ణ పేదరికంలోకి మరింత చేరుతుంది.
  8. ఈ  పూర్వనేపథ్యంలో  రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కార్పొరేట్-కాషాయ, గోడి మీడియా మద్దతుతో,  గడచిన గత నెలల్లో, మోడీ ప్రభుత్వం  ముఖ్యమైన తీవ్రవాద, కార్పొరేట్ అనుకూల,   మైనారిటీ ప్రజల  వ్యతిరేక అత్యధిక ప్రజల సమాఖ్య  స్ఫూర్తి (ఫెడరల్ )వ్యతిరేక దాడికి  పూనుకున్నది. జీవ వైవిధ్యం, అటవీ సంరక్షణ, గనులు మరియు ఖనిజాలు,  సముద్ర తీర ప్రాంతాల(ఆఫ్‌షోర్) ప్రాంతాల ఖనిజాభివృద్ధి మరియు తీర ప్రాంత ఆక్వాకల్చర్‌కు సంబంధించి ప్రతిపాదించబడిన అనేక చట్ట సవరణలు వరుసగా  చేసింది.  భూములను, అడవులు, నీరు, జీవ, సహజ, ఖనిజాలను  విపరీతమైన  కార్పొరేట్ దోపిడీని  నిరాడంకంగా జరపటానికి  మిగిలిన అడ్డంకులను తొలగించడానికి అనేక సవరణలు చేయబడ్డాయి. ఈ సవరణల మూలమున  దేశంలోని తీరప్రాంత వనరులు కార్పొరేట్ల  పరమవుతున్నాయి. కార్పొరేట్ సంపద పెరుగుదలకు  అనుసరించిన ప్రభుత్వ విధానాలు , జీవావరణ శాస్త్రానికి కోలుకోలేని నష్టం  వాటిల్లుతున్నది. జీవ వైవిధ్యం కోల్పోవడం,  అడవులను  నిర్మూలించటం, దేశంలోని పర్వత ప్రాంతాలలో పెద్ద ఎత్తున భూమి-చరియలు విరిగిపడటం, వరదలు సంభవించటం,  తరతరాల తరబడి  నివాసముంటున్న స్థానిక మరియు గిరిజన ప్రజలు  పెద్ద ఎత్తున స్థానభ్రంశం  చెందటం, వారి ఆవాసాల నుండి  వారు దూరమవుటం  జరగటం మొదలైనవి.
  9. దీనితో పాటుగా, రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితా నిబంధనలను ఉల్లంఘిస్తూ  అఖిలభారత పోలీసు విధానాల ద్వారా అదుపు చేయటం(పాన్-ఇండియన్ పోలీసింగ్‌ను సూపర్‌  ఇంపోజ్) చేసే ప్రయత్నాలు మరియు ప్రతి రాష్ట్రంలో జాతీయ నిఘా సంస్థ( ఎన్ ఐ ఏ)  కార్యాలయాన్ని ప్రారంభించే ప్రణాళికతో సహా క్రూరమైన  జాతీయ నిఘా సంస్థలను( ఎన్ఐఏ) మరియు  చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం (ఉపా)ను మరింత బలోపేతం చేయడం 2024 మొత్తం క్రిమినల్ లా స్ట్రక్చర్‌ను విధ్వంసం ( బుల్‌డోజ్) చేయడానికి ఉద్దేశించిన క్రిమినల్ చట్టాలకు సవరణలు, డిజిటల్ మీడియాపై ఫాసిస్ట్ నియంత్రణను నిర్ధారించే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం మరియు ప్రజల గోప్యత మరియు భావప్రకటనా స్వేచ్ఛను లాక్కోవడం మొదలైనవి పూర్తిగా అదే పనిలో( స్వింగ్‌లో) ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరు పేరుతో, “ఒక డేటా, ఒక ప్రవేశం”, “ఒక దేశం, ఒకే పోలీసు యూనిఫాం” వంటి అనేక ఆలోచనలు కూడా ముందుకు వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరించే దాదాపు అన్ని దేశాలు ఇప్పటికీ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి .మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)లో మాల్వేర్ యొక్క ఆమోదయోగ్యమైన చొప్పించడం వలన దాని వినియోగాన్ని విస్మరించాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ(  ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్సీ- AI )రాకతో ముడిపడి ఉన్న ప్రమాదాల సందర్భంలో, మోడీ ప్రభుత్వం మొండిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎంలను)  ఉపయోగిస్తున్నది.  ఎన్నికల కమిషన్ నియమాకాన్ని 3 మంది సభ్యుల కమిటీని ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకునే నిర్ణయాన్ని చివరికి ప్రధానమంత్రికి అప్పగించడం ద్వారా ఎన్నికల కమిషన్ పేరు స్వయంప్రతిపత్తి కూడా తీసివేయబడుతున్నది.

12.  భాజపా పాలనలోని మెజారిటీ, బ్రాహ్మణీయ, కార్పొరేట్-ఫాసిస్ట్ ఎజెండాను బహిర్గతం చేసే వారు లేదా ప్రశ్నించే వారు దేశ వ్యతిరేకులు గానూ మరియు దేశద్రోహులుగానూ ముద్రించబడ్డారు; ముద్రించబడుతున్నారు. మరియు ఉపా  లాంటి చట్టాలు మరియు వలసరాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాల వంటి క్రూరమైన నల్లజాతి చట్టాలను  ప్రయోగిస్తున్నారు . మోదీ పాలనా  మరియు ఆశ్రిత పెట్టుబడిదారుల( క్రోనీ క్యాపిటల్ లిస్ట్) విధానాలపై విమర్శలు, భిన్నాభిప్రాయాలను, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే రచయితలను, మేధావులను, దానికి దగ్గరగా ఉన్న  చేసి జైల్లో పెడుతున్నారు. పన్సారే, దభోల్కర్, కల్బుర్గీ, గౌరీ లంకేష్ వంటి ప్రఖ్యాత సాంస్కృతిక ఉద్యమకారులను, పండితులను హత్య చేయడానికి కూడా హిందుత్వ ఫాసిస్ట్ గూండాలకు ఎలాంటి సంకోచం లేదు.  తన బలంతో(మనీ పవర్‌తో) మచ్చిక చేసుకోలేని, గెలవలేని ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు భాజపాలో చేరిన వెంటనే లేదా ఫాసిస్ట్ మిత్రపక్షాలుగా మారిన తరుణంలో వదిలేస్తున్నారు. ఫాసిస్టు పాలన బట్టబయలు అవుతున్న కొద్దీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులపై కూడా ఇటువంటి సందేహం లేకుండా కేసులు పెడుతున్నారు.  ఆర్‌ఎస్‌ఎస్/బిజెపి ఆధ్వర్యంలోని భారతదేశం ఒక విలక్షణమైన నయా ఫాసిస్ట్ పాలనగా మారింది. ఇక్కడ స్వేచ్ఛా వ్యక్తీకరణ మరియు భిన్నాభిప్రాయాలకు, ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులకు కూడా ఉనికిలో  కుండా పోతున్నది .

  1. ఈ ఫాసిస్ట్ దుర్మార్గ పరిస్థితిలో, శ్రామిక మరియు పీడిత ప్రజల జీవనోపాధి మరియు జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలను చేపట్టడానికి అవసరమైన రాజకీయ సమస్యలను లేదా సంస్థాగత స్వేచ్ఛను లేవనెత్తడానికి కనీస  అవకాశం కూడా  లేదు. అందువల్ల ఫాసిస్టులను అధికారం నుండి వీలైనంత త్వరగా తొలగించడం ప్రజల తక్షణ మరియు అత్యవసర కర్తవ్యం. మరో మాటలో చెప్పాలంటే, తమ రాజకీయ డిమాండ్ల ఆధారంగా కార్మికవర్గం మరియు అణచివేతకు గురైన వారి పోరాటాలను ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఫాసిజాన్ని ఓడించడం అనివార్యం. భారతదేశంలోని మొత్తం స్థూల మరియు సూక్ష్మ రంగాలలో విస్తరించి ఉన్న  రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ( ఆర్ ఎస్ ఎస్)ఫాసిజం యొక్క నిర్దిష్ట సందర్భంలో, మరియు రాజ్యాధికారం మరియు  పై స్థాయి నుండి క్రింది స్థాయిలో వీధులలో గల్లీలలో వీధి అధికారం రెండింటిపై నియంత్రణ కలిగి ఉంది. ఈ పని కఠినమైనది మరియు సంక్లిష్టమైనది, ప్రత్యేకించి బిజెపితో పాటు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం   చేయగలిగింది. తన ఎజెండా కోసం ఇతర రాజకీయ పార్టీలను ఉపయోగించుకుంటుంది. అందుకే, ఈ క్లిష్ట తరుణంలో మరియు ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్/ భాజపా  ఫాసిస్టులను ఓడించడానికి విప్లవ వామపక్షాలకు సంస్థాగత బలం లేనందువలన, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ఫాసిస్ట్ వ్యతిరేక మరియు ప్రజాస్వామ్య శక్తులతో కలిసి బిజెపిని ఒంటరి చేయడానికి ,  ఓడించడానికి అన్ని ప్రయత్నాలూ చేయడమే విప్లవ వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ముఖ్య కర్తవ్యం.  అదేవిధంగాదాని మిత్రపక్షాలను కూడా ఓడించి, తద్వారా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ( ఆర్ఎస్ఎస్)  ఫాసిజాన్ని అధికారం నుండి తొలిగించటమే కర్తవ్యం గా ఉండాలి.
  2. ఇందుకు అనుగుణంగాగ, ఫాసిస్ట్ వ్యతిరేక ఓట్ల విభజనను నివారించడానికి అవసరమైన చర్యలను జాగ్రత్తగా తీసుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్/ భాజపా  వ్యతిరేక ఓట్లను గరిష్టంగా ఏకీకృతం చేయడానికి అన్ని ప్రయత్నాలు మరియు తగిన చర్యలు తీసుకోవడం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ వ్యతిరేక ప్రజాతంత్ర శక్తుల కీలకమైన పని. ఫాసిస్టులను ఏకాకిని చేయడానికి మరియు ఓడించడానికి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్థూల అఖిల భారత స్థాయి నుండి సూక్ష్మ స్థాయి పార్లమెంటరీ నియోజకవర్గాల వరకు ఒక దృఢమైన ఫాసిస్ట్ వ్యతిరేక ప్రచారాన్ని అన్ని ప్రగతిశీల-ప్రజాస్వామ్య మరియు భావసారూప్యత గల శక్తులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. భారతదేశ కూటమి (ఇండియా కూటమికి) చెందిన నాన్-ఫాసిస్ట్ పార్టీలు, కార్పోరేట్ పెట్టుబడి( క్యాపిటల్‌)లో తమ మూలాలను కలిగి ఉన్నప్పటికీ, అవి తప్పనిసరిగా నయా ఉదారవాదం అయినప్పటికీ, అటువంటి కూటమిలో భాగం కాకుండా, తాము అధికారంలో ఉన్న ప్రతిచోటా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్నప్పటికీ   ఆర్ఎస్ఎస్/ భాజపాపాసిస్టు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఓటు చేయాల్సిన అవసరం ఉన్నది. మరియు వారి సైద్ధాంతిక-రాజకీయ స్వాతంత్రాన్ని నిలకడగా నిలబెట్టాయి. కార్మికులు మరియు అణచివేతకు గురైన వారందరి స్థానాన్ని నిలబెట్టడం కోసం, వామపక్ష-ప్రజాస్వామ్య శక్తులు ఫాసిస్ట్ అభ్యర్థులను ఓడించేందుకు వ్యూహాత్మకంగా తమ ఓట్లను ఉపయోగించుకోవాలి.

15.  ఏమైనప్పటికీ,( ఇండియా కూటమి) భారత కూటమిలోని భాగస్వామ్య పక్షాల సైద్ధాంతిక-రాజకీయ బలహీనత కారణంగా, వారు బిజెపిని ఓడించగలిగినప్పటికీ, అత్యంత అవినీతి కార్పొరేట్ పెట్టుబడి, బ్రాహ్మణీయ అగ్రవర్ణాలు మరియు ప్రతిచర్యల మద్దతుతో ఫాసిస్ట్ పునరాగమనం ముప్పు ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ)ని తోసిపుచ్చలేము. అందువల్ల, భాజపాను ఓడించగల అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా ఫాసిజాన్ని ఓడించాలనే వ్యూహాత్మక అడుగును ఆశ్రయిస్తూనే, వామపక్ష-ప్రజాస్వామ్య శక్తులు స్వతంత్రంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేయడం మరియు దీర్ఘకాలిక దృక్పథంతో అణగారిన వారందరి ఉద్యమాలను నిర్మించడం ద్వారా స్వతంత్రంగా ముందుకు సాగాలి. భారతీయ ఫాసిజం యొక్క భౌతిక మరియు సైద్ధాంతిక ప్రాతిపదికను రూపొందించే నయా ఉదారవాద కార్పొరేటీకరణ మరియు మనువాద కుల వ్యవస్థకు వ్యతిరేకంగా  నిజమైన ప్రజల ప్రత్యామ్నాయం  నిర్మించాలి.

  1. క్లుప్తంగా,  ఆర్ఎస్ఎస్  /భాజపా ఫాసిజాన్ని కూల ద్రోసే  తక్షణ కర్తవ్యానికి సంబంధించి,  సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ప్రజల జీవించే హక్కు కోసం ,  ప్రజాస్వామ్యం, లౌకికవాదం మరియు కుల ఆధారిత రిజర్వేషన్‌లను సమర్థించే వారందరికీ , పై విధంగా విజ్ఞప్తి చేస్తున్నది. భారత రాజ్యాంగంలో  చెప్పినట్లుగా అన్ని ఫాసిస్ట్ వ్యతిరేక ప్రజాతంత్ర శక్తులకు సంఘీభావంగా ఎదగాలని, ఫాసిస్ట్ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా అన్ని ప్రయత్నాలను చేపట్టాలని మరియు సార్వత్రిక ఎన్నికల్లో  ఆర్ఎస్ఎస్/ భాజపాని ఓడించేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగాలని కోరుతున్నాము.

*ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ భాజపా ని ఓడించండి!
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం మరియు కుల ఆధారిత రిజర్వేషన్లను కాపాడండి!
నయా ఉదారవాద కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల ప్రత్యామ్నాయాన్ని రూపొందించండి!
కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయండి!
ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాడండి!
*సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్

ప్రచురణ కర్త:
1.కొల్లిపర వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి.
మొబైల్ నెంబర్: 9392325652
కామ్రేడ్ కొల్లా వెంకయ్య విజ్ఞాన కేంద్రం,
లింగాయ పాలెం ,గుంటూరు-5.

  1. మొలుగూరి సైదయ్య
    రాష్ట్ర కార్యదర్శి .తెలంగాణ కమిటీ.
    హైదరాబాద్
    మొబైల్ నెంబర్:9550444901

Related Posts

Leave a Comment