Home » సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ మన్యం జిల్లా కార్యదర్శిగా శ్రీ తోట జీవన్న  ఏకగ్రీవంగా ఎన్నిక!   

సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ మన్యం జిల్లా కార్యదర్శిగా శ్రీ తోట జీవన్న  ఏకగ్రీవంగా ఎన్నిక!   

by admin

సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ మన్యం జిల్లా కార్యదర్శిగా శ్రీ తోట జీవన్న  ఏకగ్రీవంగా ఎన్నిక!

ఆర్ఎస్ఎస్ /భాజపాసిజాన్ని ఓడించటమే నేటి తక్షణ కర్తవ్యం !  –
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీమన్నవ హరిప్రసాద్  ఉద్ఘాటన

సిపిఐ( ఎంఎల్) రెడ్ స్టార్ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీకి  తోట  జీవన్న  ప్రధాన  కార్యదర్శిగా  కమిటీ  ఏర్పాటు అయింది . జిల్లా కమిటీ సభ్యులుగా జరుగు బిల్లి సూరయ్య , మండంగి నీలమ్మ , బొత్స మోహనరావు, గుజ్జా జనార్ధన, రామ్మూర్తి, హరినాన సీతమ్మ , కార్యవర్గ సభ్యులుగా ఏర్పాటైంది. ఈరోజు పార్వతిపురం  భాస్కర్ లాడ్జి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో   పార్వతీపురంమన్యం జిల్లా నలుమూల నుండి హాజరైన కార్యకర్తలు  కార్యకర్తలు జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమావేశానికి  పార్టీ రాష్ట్ర కమిటీ నుండి  పరిశీలకులుగా  సిపిఐ (ఎం.ఎల్ )రెడ్ స్టార్ పోలిట్ బ్యూరో సభ్యులు, మన్నవ హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  ధన కుదరం రంగనాథ్, భీమవరపు సుబ్బారావు  హాజరయ్యారు. ఈ సమావేశానికి  కామ్రేడ్ మన్నెంగి నీలమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మన్నవ హరిప్రసాద్ మాట్లాడుతూ- 1920 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ అక్టోబర్ 17న తాష్కెంట్లో  భారతకమ్యూనిస్టు పార్టీలో ఏర్పడిందని, 1925 డిసెంబర్ 25వ తేదీన కాన్పూర్ లో మొదటి మహాసభ జరుపుకున్నదని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా  సంపూర్ణ స్వరాజ్యం నినాదాన్ని మొట్టమొదటిసారిగా ఇచ్చిందని, ఆయన అన్నారు. దురదృష్టవశాత్తూ  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సిపిఐ(ఎం) సిపిఐ(ఎం.ఎల్) గ్రూపులుగా ఏర్పడిందని , సిపిఐ ఎమ్.ఎల్ గ్రూపులు   చైనా పంధాన్ని అనుసరించి  భారతదేశం అర్ధవలస ,అర్థ భూస్వామ్య దేశం అని  సూత్రికరించారని వివరించారు. భారతదేశం అర్థ వలస అర్ధ భూస్వామ్య దేశం కాదని, భారతదేశం నయా వలస, నయా భూస్వామ్య దేశమని రెడ్ స్టార్  సిద్ధాంతరీకరించిందని  ఆయన తెలియజేశారు.
జాతీయోద్యమంలో ఎటువంటి పాత్ర లేని  హిందూ మతోన్మాదం పునాదిగా కలిగిన  ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ  మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చాలని చూస్తుందని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరించే జిఎస్టిని, ఎన్పీఆర్ ,ఎన్ ఆర్ సి,  సి ఏఏ చట్టాలను తీసుకువచ్చిందని, మూడు  వ్యవసాయ చట్టాలను ,నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని   ఆర్ఎస్ఎస్ /బిజెపి ఫాసి జానికి వ్యతిరేకంగా  పోరాడటమే నేటి ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం అని  ఆయన వివరించారు. ఇంకా ఈ సభలో  పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  శ్రీ  రంగనాథం, భీమవరపు సుబ్బారావు  తదితరులు ప్రసంగించారు.
పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం  కామ్రేడ్  తోట జీవన్న ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు.

Related Posts

Leave a Comment