Home » జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం సీలింగ్ భూములు పేదలకు వెంటనే పంచాలి!

జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం సీలింగ్ భూములు పేదలకు వెంటనే పంచాలి!

by admin

ఆగస్టు 21పంగిడిగూడెం   న్యూస్ ప్రతినిధి:

జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం సీలింగ్ భూములు పేదలకు వెంటనే పంచాలి!

–  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్@

జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం గ్రామంలో దళిత పేదలు సాగు చేసుకుంటున్న సీలింగ్ భూముల విషయమై చర్చించటానికి రెవెన్యూ, పోలీసు వారు వచ్చి సాగుదారులైన దళితులను బెదిరించటానికి పూనుకొని సదరు సాగులో ఉన్న సాగుదారులపై   కేసులు పెడతామని బెదిరించారు.

ఈ తరుణంలో సీలింగు భూముల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సిపిఐ(ఎం.ఎల్ )రెడ్ స్టార్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి  జొన్నకూటివెంకటేశ్వరరావు సంబంధిత రెవెన్యూ పోలీస్ అధికారులతో  చర్చలు జరిపారు.  రిట్ పిటిషన్ నంబర్:12445/2023  తీర్పును అనుసరించి గౌరవ హైకోర్టు వారు   ఇచ్చిన తీర్పును అనుసరించి  భూముల విషయం సత్వర పరిష్కరించాలని,  జిల్లా కలెక్టర్ గారికి  ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. విషయమై రాష్ట్ర హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను  లోకాయుక్తులను చట్టబద్ధమైన పోరాటం చేస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ గారు సదరు సీలింగ్ భూముల  సమస్యను సత్వరం పరిష్కరించాలని భూస్వాముల పిటిషన్ను హైకోర్టు వారు డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన   సర్వే నంబర్లు   సీలింగు భూమి అగ్రకుల భూస్వాములు  సంబంధిత రెవెన్యూ అధికారుల సహాయంతో 60 ఎకరాల సీలింగు భూమిని  కబ్జా చేసారు. 15 ఎకరాలు మాత్రమే  దళితులు సీలింగు భూములను సాగు చేసుకుంటున్నారని, వెంటనే భూస్వాములు చట్ట విరుద్ధంగా సాగు చేసుకుంటున్న సీలింగ్ భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను  జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.  ఈ భూముల విషయమై గత అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నామని వెంకటేశ్వరరావు వివరించారు.

సదరు విషయమై 25- 8-2025 సోమవారం  నాడు తహసీల్దారుకు, ఆర్డీవో జంగారెడ్డి గూడెం వారి వద్దకు రావాలని రెవిన్యూ ,పోలీస్ అధికారులు సూచించారు. అందుకు  సీలింగు  భూములు   సాగు చేసుకుంటున్న దళిత పేదల పక్షాన శ్రీ జొన్నకూటి వెంకటేశ్వరరావు  రెవెన్యూ  పోలీసు అధికారులతో మాట్లాడుతూ రెవెన్యూ వారు  భూములను స్వాధీనం చేసుకొని దళిత పేదలకు పంచక పోయినట్లయితే  భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికులైన దళితులే భూములు ఆక్రమించుకుంటారని  అందుకు ప్రభుత్వము, రెవిన్యూ వారే బాధ్యత వహించాలని  జొన్నకూటి వెంకటేశ్వరరావు హెచ్చరించారు.  భూమిలేని పేదలు అనేక పోరాటాలు చేస్తే 1/ 19 73 వ్యవసాయ భూగరిష్ట  పరిమితి చట్టం వచ్చిందని, ఆ చట్టాన్ని అనుసరించి  భూస్వాముల నుండి మిగులుగా తేలిన భూములను  ప్రభుత్వం స్వాధీనం చేసుకొని  భూమిలేని పేదలకు పంచాలని   అనేక హైకోర్టు ,సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ  ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  భూస్వాముల  పక్షాన  ఉంటున్నది కానీ  భూమిలేని పేదలకు సీలింగ్ భూములు దక్కటం లేదని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై  సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్, నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో  భూమిలేని పేదలు భూ పోరాటాలు చేస్తున్నారని  జొన్నకూటి వెంకటేశ్వరరావు వివరించారు.

ఈ కార్యక్రమంలో   నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ కార్యకర్తలు ఎం. వెంకట్రావు, ఏ వెంకటేశ్వరరావు ,జి స్వామిలా, కే రవి , పి ఏసు పాల్గొన్నారు.

జొన్నకూటి వెంకటేశ్వరరావు.
పశ్చిమగోదావరిజిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్
‪+919505931254‬

Related Posts

Leave a Comment