ధర్మవరం, అనంతపురం జిల్లా ఆగస్టు 25:
వర్తమాన రాజకీయాలు -ప్రజా ఉద్యమాలు సదస్సును విజయవంతం చేయండి !
కామ్రేడ్ నిరంజన్ సిపి ఐ( ఎం.ఎల్) రెడ్ స్టార్ జిల్లా నాయకుడు
సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ జిల్లా నాయకుడు కామ్రేడ్ నిరంజన్ నాయకత్వంలో ఒంగోలులో వర్తమాన రాజకీయాలు ప్రజా ఉద్యమాలు అనే అంశంపై కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.
* ధర్మవరం పట్టణంలో శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఈనెల 29న ఒంగోలులో జరగనున్న వర్తమాన రాజకీయాలు ప్రజా ఉద్యమాల సదస్సును కరపత్రాలు విడుదల చేయడం జరిగింది*
ఈ సందర్భంగా జిల్లా సభ్యులు నిరంజన్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బిజెపి సర్కార్ పది సంవత్సరాల పూర్తి చేసుకున్న తర్వాత 3వసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేయాలని ఉద్దేశంతో రోజుకు ఒక వివాదాస్పద నిర్ణయంతో దేశ ప్రజలను పక్క దారిన తీసుకెళ్తంది. భారత దేశ అభివృద్ధికి ప్రజల సుపరిపాలన కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం అమలుకు మనువాదులు బిజెపి ప్రభుత్వం ఏమాత్రం ఇష్టపడడం లేదు.రాజ్యాంగ ఆదేశాలకు విరుద్ధంగా దళితులను మైనార్టీలను బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతోంది. నేడు దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విస్తృతమైనాయి. రైతులు ఆందోళన పై ఉక్కు పాదం మోపడం, మణిపూర్ లో ఒక వర్గం ప్రజలపై ధమకాండ, బాబ్రీ మసీదు కూల్చివేత, పౌరసత్వ సవరణ బిల్లు, లౌకికవాదాన్ని మంట కలపడం ,దేశ పౌరులపై నిర్బంధకాండ సృష్టిస్తున్నది. మనువాద బిజెపి ఒకే దేశం -ఒకే ఎన్నికలు పేరుతో దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవేస్తోన్నది. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్) రెడ్ స్టార్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని. ప్రజలకు హామీ ఇచ్చి హామీలు నెరవేర్చకపోగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరుగుతున్నది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి నష్టం చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం పనిస్తున్నది.కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని గతంలో శంకుస్థాపనకు పరిమితమైంది తప్ప ,నిర్మాణానికి నోచుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండోసారి అమరావతి పునర్నిర్మాణానికి భూమి పూజ వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు గాని కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో విఫలం చెందారు. మరియు అదేవిధంగా సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అన్ని రకాల బస్సు సర్వీసులకుగానీ , దాఖలాలు లేవు. నూతన పింఛన్లు నేటి వరకు కూడా ఎక్కడ అమలు చేయకపోగా ఉన్న పింఛన్లను కూడా తొలగించడం జరుగుతున్నది. ఇటీవల వికలాంగుల పెన్షన్లు తొలగించడం పై వారు ఆందోళన బాట పట్టారు.రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య విద్యను దూరం చేసి ప్రైవేటీకరణను అప్పజెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను మేము నిర్మించలేమని కూటమి ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషనర్ కి లేఖ రాయడం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్సిస్టు- లెనినిస్టు) రెడ్ స్టార్ తీవ్రంగా ఖండిస్తోన్నది. వీటన్నిటి పైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ లెనినిస్ట్) రెడ్ స్టార్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల శ్రీకారం చుట్టబోతోంది. నాయకులు కార్యకర్తలు పార్టీ సభ్యులు అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాము.
నిరంజన్ సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్, జిల్లా సభ్యులు, ధర్మవరం- అనంతపురం జిల్లా
+917569484678
