Home » ట్రంప్ వ్యాఖ్యలను నిరసిస్తూ , అమెరికా పన్ను విధింపులకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో ధర్నా!

ట్రంప్ వ్యాఖ్యలను నిరసిస్తూ , అమెరికా పన్ను విధింపులకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో ధర్నా!

by admin

ట్రంప్ వ్యాఖ్యలను నిరసిస్తూ , అమెరికా పన్ను విధింపులకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెంలో ధర్నా!

భారత పాలకవర్గాల అమెరికా అనుకూల విధానాలను నిరసించాలి:

సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ నేత జొన్నకూటి వెంకటేశ్వరరావు పిలుపు!

భారతదేశ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాపితంగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ట్రంపు వ్యాఖ్యలను నిరసిస్తూ  వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 6- 9 -2025న శనివారం జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయం వద్ద  పెద్ద ఎత్తున ధర్నా జరిగింది.

ఈ ధర్నాలో సిపిఐ( ఎం.ఎల్) రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశమైన అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ భారత్  దేశంపై కక్షపూరితంగా అధిక సుంకాలు విధించి కక్ష సాధింపు చర్యలకు కోరుకుంటున్నాడని వెంకటేశ్వరరావు అన్నారు. భారత పాలకవర్గాలు అమెరికాకు జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపటం లేదని వెంకటేశ్వరరావు ఆరోపించారు.  కాషాయ కార్పొరేట్ అనుకూల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు  దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దానికి వ్యతిరేకంగా ప్రజలు కార్మిక, కర్షకులు, విద్యార్థి, మేధావులు, సకల ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమించాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దారు గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు -కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీ మందలపల్లి రాజు, నాయకులు కామవరపు సత్యనారాయణ సిపిఐ పార్టీ నుండి పి. రమణ రాజు ,వి వసంతరావు, సిపిఐ (ఎమ్.ఎల్)  న్యూ డెమోక్రసీ నాయకులు , కెవి రమణ ,సరియం రామ్మోహన్రావు, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నుండి సాలి రాజశేఖర్, కే. సత్యం తదితరులు ప్రసంగించారు.

ఉద్యమాభివందనలతో,
జొన్నకూటి వెంకటేశ్వరరావు,
‪+91 72075 11361‬
సిపిఐ (ఎం.ఎల్ )రెడ్ స్టార్,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి., జంగారెడ్డిగూడెం.

Related Posts

Leave a Comment