Home » జియోనిస్ట్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక పటిష్టమైన మరియు సమన్వయంతో కూడిన రాజకీయ, ఆర్థిక మరియు సైనిక చర్య అత్యవసరం!

జియోనిస్ట్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక పటిష్టమైన మరియు సమన్వయంతో కూడిన రాజకీయ, ఆర్థిక మరియు సైనిక చర్య అత్యవసరం!

by admin

జియోనిస్ట్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక పటిష్టమైన మరియు సమన్వయంతో కూడిన రాజకీయ, ఆర్థిక మరియు సైనిక చర్య అత్యవసరం!

పి జె జేమ్స్, ప్రధాన కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్

అమెరికా-జియోనిస్ట్ కూటమి గాజాపై తుది దశ మారణహోమాన్ని ప్రకటించినందున, అంతర్జాతీయ సమాజం నుండి వచ్చే వాక్పటిమతో కూడిన ప్రకటనలు అర్థరహితం!

గాజాను ఆక్రమించాలనే తమ అంతిమ ప్రణాళికతో, ట్రంప్-నెతన్యాహు ద్వయం పాలస్తీనియన్లపై పాల్పడిన భయానక మరియు నేరపూరిత చర్యలు ఇప్పటివరకు జరిగిన ఘోరాలన్నింటిని అధిగమించాయి. అయినప్పటికీ, ఐక్యరాజ్యసమితి మరియు యూరోపియన్ యూనియన్ నాయకులతో సహా అంతర్జాతీయ సమాజం జియోనిస్ట్ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా వాక్పటిమతో కూడిన ప్రకటనలు జారీ చేయడానికే పరిమితమై ఉంది. జియోనిస్టులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న ఆ ప్రపంచ నాయకులు కూడా, అంతర్జాతీయ పోలీసుగా స్వయం ప్రకటితమైన అమెరికా, నెతన్యాహు యొక్క అమానుషత్వాన్ని చూస్తూ మౌనంగా ఉన్నారు.మానవత్వానికి వ్యతిరేకమైన అమానుషమైన నేరాలకు పూర్తి మద్దతు ఇస్తున్న విషయంపై మౌనంగా ఉన్నారు. అనేక ప్రముఖ యూరోపియన్ యూనియన్ పాలనా వ్యవస్థలు, జియోనిస్ట్ మారణహోమం, భయానక చర్యలు మరియు నేరాలను మాటల్లో ఖండిస్తూనే, నిస్సిగ్గు గా ఇజ్రాయెల్‌కు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. నయా ఫాసిస్ట్ యూరోపియన్ యూనియన్, మరియు భారతదేశం వంటి ఫాసిస్ట్ పాలనా వ్యవస్థల ఈ ద్వంద్వ వైఖరి, గాజా నుండి పాలస్తీనియన్లను పూర్తిగా తుదముట్టించాలనే జియోనిస్ట్ ప్రాజెక్టును కొనసాగించడానికి నెతన్యాహుకు మరింత ధైర్యాన్నిచ్చింది.

గాజా ప్రజలపై పద్ధతి ప్రకారం జరుగుతున్న జియోనిస్ట్ నిర్మూలన మరియు మారణహోమం ఇంతకు ముందు ఎన్నడూ చూడని క్రూరత్వాలను సంతరించుకుంది. ఈ విషయంలో, అమెరికా మద్దతుతో నడిచే దుర్మార్గమైన (గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్- GHF) అనుసరించిన హేయమైన పద్ధతుల్లో ఒకటి, ఆకలితో ఉన్న పాలస్తీనియన్లను సహాయ పంపిణీ కేంద్రాలకు ఆకర్షించి, వారిని సామూహికంగా చంపడం. ఇప్పుడు, గాజా ప్రజలను వారి నివాసాల నుండి పూర్తిగా నిర్మూలించి, స్థానభ్రంశం చేసే ప్రణాళికలో భాగంగా, ఈ పద్ధతిని మొత్తం గాజా నగరానికి విస్తరిస్తున్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి స్వతంత్ర సంస్థల నివేదికల ప్రకారం, దిగ్బంధనం, బాంబు దాడి, ముట్టడి, ఆకలి, వ్యాధులు మరియు హత్యల వంటి ఈ భయంకరమైన కలయిక గాజాలో ఒక సాధారణ విషయంగా మారింది. అన్ని వర్గాల నుండి వస్తున్న సంఘీభావ ప్రకటనలు మరియు ఖండనల మధ్య, ఈ రోజు అమెరికా నేతృత్వంలోని నయాఫాసిస్ట్ ప్రపంచ వ్యవస్థ, యాంకీ-జియోనిస్ట్ కూటమి తమ నేరాలను శిక్షార్హత లేకుండా కొనసాగిస్తుండగా యావత్ ప్రపంచం ఒక ప్రేక్షకుడుగా మాత్రమే మిగిలిపోయింది. అక్కడ జరుగుతోంది ఒక యుద్ధం కాదు, ఆహారం కోసం ఏడుస్తున్న బలహీనమైన పిల్లలు, గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలు మరియు వికలాంగులతో సహా ఆశ్రయం లేని మరియు ఆకలితో ఉన్న పౌరులపై జరుగుతున్న ఏకపక్ష మారణహోమం, మరియు చాలా మంది క్రమం తప్పకుండా చనిపోతున్నారు. అమెరికా-జియోనిస్ట్ యుద్ధ యంత్రం స్వతంత్ర మానవతా సంస్థలు మందుల సరఫరాను కూడా నిరంతరం అడ్డుకుంటోంది, మరియు వారి కార్మికులను జర్నలిస్టులతో పాటు చంపుతోంది.

నిజం చెప్పాలంటే, ఆహారాన్ని ప్రాథమిక మానవ హక్కుగా గుర్తించాలన్న ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనకు అమెరికా మరియు ఇజ్రాయెల్ మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశాయి, ఆకలితో చనిపోయిన పిల్లల సంఖ్య 300 దాటింది. అయితే, ఇప్పటికే చెప్పినట్లుగా, ప్రకటనలు జారీ చేయడంతో పాటు, ప్రముఖ యూరోపియన్ యూనియన్ శక్తులు చట్టవిరుద్ధమైన మరియు నేరపూరితమైన జియోనిస్ట్ ఆక్రమణ, విధ్వంసం మరియు పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా తగిన రాజకీయ, ఆర్థిక మరియు సైనిక చర్యలు తీసుకోవడానికి ఇంకా వెనుకాడతున్నాయి. అంతేకాకుండా, జియోనిస్ట్‌లు అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్న యూరోపియన్ యూనియన్లు మరియు నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీ టి ఆర్గనైజేషన్ -NATO) సభ్యులు, అమెరికా-జియోనిస్ట్ కూటమితో కలిసి, ఇప్పుడు పదేపదే ఇరాన్‌ను వెంటాడుతూ, దాని ఆరోపించిన అణు కార్యక్రమాల గురించి బెదిరిస్తున్నారు. ఇది నయాఫాసిస్ట్ యూరోపియన్ యూనియన్ యొక్క అంతర్లీన ఇస్లామోఫోబియా మరియు జియోనిస్ట్ అనుకూల వైఖరిలో భాగం. ఆక్రమిత పాలస్తీనాలో ఉన్న ఏకైక జియోనిస్ట్ వ్యతిరేక రాజకీయ ప్రతిఘటన శక్తి అయిన “హమాస్‌”ను యూరోపియన్ యూనియన్ నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం కూడా జియోనిజం పట్ల ఈ క్షమాపణలో భాగమే. బ్రిటన్‌లోని స్టార్మర్ ప్రభుత్వం గాజాలో జరుగుతున్న జియోనిస్ట్ మారణహోమానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను నేరంగా పరిగణిస్తోంది, మరియు నిరసనకారులను “ఉగ్రవాదులు”గా కూడా ముద్ర వేస్తోంది. అదే సమయంలో, జియోనిస్ట్‌లకు నేటి పోషకుడైన ట్రంప్, పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపిన బ్రెజిల్ మరియు వెనిజులా వంటి లాటిన్ అమెరికా దేశాలకు ఆర్థిక మరియు సైనిక బెదిరింపులు జారీ చేసే ప్రక్రియలో ఉన్నాడు.

ఈలోగా, అమెరికాకు లంచాలుగా ఉన్న మరియు వారి భారీ పెట్రోడాలర్ డిపాజిట్ల భద్రత గురించే మాత్రమే ఆందోళన చెందే అనేక అరబ్ పాలనా వ్యవస్థలు, పాలస్తీనియన్లపై జరుగుతున్న అమెరికా-జియోనిస్ట్ మారణహోమానికి ఉదాసీనంగా ఉండటం హేయమైనది. అదే సమయంలో, వందల వేల మంది లౌకిక యూదులు నెతన్యాహు పాలన యొక్క గాజా మారణహోమానికి వ్యతిరేకంగా ఆందోళనకు ముందుకు రావడం హృదయపూర్వకంగా ఆహ్వానించవలసిన విషయం. స్వతంత్ర పరిశీలకుల ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యంలో పెరుగతున్న అసంతృప్తి మరియు తిరుగుబాటు ఏ క్షణంలోనైనా నియంత్రణ కోల్పోవచ్చు. ట్రంప్ యొక్క ఉదారమైన ఆర్థిక మరియు సైనిక మద్దతు ఉన్నప్పటికీ, చాలా మంది ఇజ్రాయెల్ లోపల నుండి త్వరలో ఒక అంతర్గత విస్ఫోటనం సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ప్రపంచంలోని పాలక ప్రభుత్వాలు అమాయక పాలస్తీనియన్లపై జరుగుతున్న ఈ 21వ శతాబ్దపు మారణహోమంపై తమ సిగ్గులేని నిష్క్రియతను ప్రదర్శిస్తూనే ఉన్నాయి.

ఈ సందర్భంలో, ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి, అవసరమైన రాజకీయ, ఆర్థిక మరియు సైనిక చర్యలను తీసుకోవడానికి ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రావడానికి ఇది సరైన సమయం. అమెరికా-జియోనిస్ట్ కూటమిని వేరుచేసి, పాలస్తీనాపై అత్యంత దుర్మార్గమైన జియోనిస్ట్ పట్టును నిర్మూలించడానికి తగిన విధంగా జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే స్పష్టమైనట్లుగా, ప్రస్తుత అమెరికా నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి వ్యవస్థ మరియు దాని అంతర్జాతీయ ఏర్పాట్లు నయా ఫాసిస్ట్, నయా ఉదారవాద సందర్భంలో దాని పదును మరియు విశ్వసనీయతను కోల్పోయాయి. భౌగోళిక-రాజకీయ కారణాల మొత్తం సమితి కారణంగా, అమెరికా యొక్క నయా వలసవాద(నియోకలోనియల్ )సైనిక కేంద్రమైన జియోనిస్ట్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆంగ్లో-సాక్సన్ వర్గాల నుండి ఒక చొరవ ఆశించలేము. ప్రపంచంలోని శ్రామిక మరియు అణగారిన ప్రజలలో అత్యధిక మెజారిటీని కలిగి ఉన్న ఆఫ్రో-ఆసియన్-లాటిన్ అమెరికన్ దేశాలు, ప్రపంచంలోని అన్ని అభివృద్ధికర శక్తులు మంచి మనసున్న ప్రజలతో కలిసి, ఈ పనిని ఆలస్యం చేయకుండా ఎగిసి చేపట్టాలి.

ఇట్లు,
పి జే జేమ్స్, ప్రధాన కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్.
———————‐————————‐——– తెలుగు స్వేచ్ఛానుసరణ: కొల్లిపర వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యుడు ,సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్
93923256
vkollipara75@gmail.com.

Related Posts

Leave a Comment