కొయ్యలగూడెం: సెప్టెంబర్ 8
మంగపేట శివారు, బుల్లింపేట సీలింగ్ భూములు తక్షణమే భూమిలేని దళిత పేదలకు, గిరిజనులకు పంచాలి!
-* నవ్యాంధ్రప్రదేశ్ రైతు- కూలీ సంఘం డిమాండ్!
కొయ్యలగూడెం మండలం, మంగపేట పంచాయితీ శివారు బుల్లింపేట ,గిరిజనులకు సీలింగ్ భూములు పంచాలని” స్వర్ణాంధ్రప్రదేశ్ రైతు- కూలీ సంఘం “ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొయ్యలగూడెంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా జరిగింది.
ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ( ఎం.ఎల్) రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంగపేట రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ నెంబర్ 18,19 నంబర్లలో ఉన్న 30 ఎకరాల సీలింగ్ భూమి కొంతమంది అగ్రకుల భూస్వాముల కబ్జాకు గురి అయినదని, సదరు సీలింగ్ భూములు అన్ని స్వాధీనం చేసుకుని అర్హులైన గిరిజన దళిత పేదలకు పంచాలని, ఆనేక దఫాలుగా తహసిల్దారుకు నుండి ఉన్నతాధికారుల వరకు అర్జీలు పెట్టుకుంటూ ఆందోళన చేసినప్పటికీ, అధికారులు పట్టించుకోకపోగా భూస్వాములకు వత్తాసు పలుకుతూ, సీలింగ్ భూములు పేదలకు చెందకుండా చేస్తున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ఇప్పటికైనా తహసిల్దార్ వారు ఆ మంగపేట సీలింగ్ భూముల కబ్జా విషయమై క్షేత్రస్థాయి విచారణ జరిపి అగ్రకుల భూస్వాముల కబ్జా నుండి సీలింగ్ భూములు స్వాధీనం చేసుకొని గిరిజనలకు, దళితులకు పంచాలని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి భారత్ మహాసభ(ABM) రాష్ట్ర కార్యదర్శి మడకం రామన్న నవ్యాంధ్రప్రదేశ్ రైతు -కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మండల పల్లి రాజు, నాయకులు లంగాల దుర్గారావు, కామన సత్యనారాయణ ,ఎస్. వెంకటరావు టి. నాగమణి మహిళా సంఘం నాయకురాలు గన్నమనేని నాగమణి, కే .కుమారి, కోసం దుర్గ, పి .నాగమణి తదితరులు ప్రసంగించారు.
కొయ్యలగూడెం
8- 9- 2025
ఇట్లు ,
ఉద్యమాభివందనలతో ,
జొన్నకూటి వెంకటేశ్వరరావు
9 5 0 59 31 25 4
