Home » ఇజ్రాయెల్ “యుద్ధ నేరగాళ్లతో” భారత ప్రభుత్వం ఒప్పందం దేశ ప్రజలకు సిగ్గుచేటు!

ఇజ్రాయెల్ “యుద్ధ నేరగాళ్లతో” భారత ప్రభుత్వం ఒప్పందం దేశ ప్రజలకు సిగ్గుచేటు!

by admin

ఇజ్రాయెల్ “యుద్ధ నేరగాళ్లతో” భారత ప్రభుత్వం ఒప్పందం దేశ ప్రజలకు సిగ్గుచేటు!

న్యూఢిల్లీ: అమెరికా అండతో పాలస్తీనాలోని గాజాపై జియోనిస్ట్ ప్రభుత్వం మారణహోమాన్ని తీవ్రతరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, మరియు నెతన్యాహు పాలన అంతర్జాతీయ సమాజం నుండి క్రమంగా ఒంటరి అవుతూ, దేశాల సమాఖ్య నుండి ఆంక్షలను ఎదుర్కొంటున్న తరుణంలో, 8 సెప్టెంబర్ 2025న భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని (Bilateral Investment Agreement – BIA) కుదుర్చుకుంది. మరింత విస్తుపోయే విషయం ఏంటంటే, ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంతకం చేసిన ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్‌పై “యుద్ధ నేరాలు” మరియు “మానవత్వంపై నేరాలు” చేసినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సహా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్( ICC )”అరెస్ట్ వారెంట్” ఉంది.

నయా ఉదారవాద కాలంలో దేశంలో జియోనిస్ట్ అనుకూల హిందుత్వ రాజకీయాలు బలపడే వరకు, పాలస్తీనియన్లతో భారతదేశానికి అద్భుతమైన సంఘీభావ చరిత్ర ఉంది. భారతదేశ “జాతిపిత” మహాత్మా గాంధీ స్వతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య పాలస్తీనాకు గట్టి మద్దతుదారు. ఆయన పాలస్తీనియన్లపై ఆంగ్లో-అమెరికా ఇజ్రాయెల్‌ను బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఇస్లామోఫోబిక్ మోడీ పాలనలో, హిందుత్వ లేదా రాజకీయ హిందూ మతంలో దాని భావజాల మూలాలతో, భారతదేశం యొక్క ఈ ప్రగతిశీల సంప్రదాయం పూర్తిగా కనుమరుగైంది. అనేక ఆఫ్రో-ఆసియా-లాటిన్ అమెరికా దేశాలు మరియు కొన్ని యూరోపియన్ యూనియన్( EU) సభ్య దేశాలు ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకుంటున్నప్పటికీ (భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న స్మోట్రిచ్‌ను యునైటెడ్ కింగ్డమ్(UK), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్వే మరియు కెనడా నిషేధించాయి), భారతదేశం దానితో ఆయుధ ఒప్పందాలను కొనసాగిస్తోంది. మరోవైపు, జనవరి 2024లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-( అంతర్జాతీయ న్యాయస్థానం- ICJ) తీర్పు తరువాత, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, టర్కీ మరియు జపాన్ ఇజ్రాయెల్‌కు ఆయుధ విక్రయాలను నిలిపివేశాయి. గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం తీవ్రతరం అయినప్పుడు, భారతదేశం తన బ్లూ కాలర్ కార్మికులను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తోంది, వీరు “క్యానన్ ఫాడర్”గా మారారు.

వాస్తవానికి, ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు భారతదేశాల మధ్య కుదిరిన ఈ కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం(BIA), 1996 నాటి ఒప్పందం స్థానంలో వచ్చింది.మరియు రెండు దేశాలలోని బంధువుల పెట్టుబడిదారుల మధ్య పరస్పర పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది.ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో భారతీయ కార్మికులకు మరింత ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఒక ప్రాతినిధ్య కార్యాలయాన్ని తెరవడానికి సాధ్యతను పరిశీలిస్తోందని స్మోట్రిచ్ ప్రకటించడం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జియోనిస్ట్ పాలనతో భారత ప్రభుత్వం చేసుకున్న ఈ సిగ్గులేని ఒప్పందం భారత ప్రజలకు సిగ్గుచేటు.మరియు ఇది అత్యంత ఖండించదగినది. ఈ ఒప్పందం వెనుక భారత ప్రభుత్వం యొక్క పెరుగుతున్న ఇస్లామోఫోబిక్ ధోరణి దాగి ఉంది. ఇది అమెరికా( US )సామ్రాజ్యవాద ఆశ్రయం కింద లోతైన జియోనిస్ట్-హిందుత్వ సంబంధానికి నిదర్శనం. ఈ హీనమైన ఒప్పందాన్ని జియోనిస్ట్ పాలనతో వెంటనే రద్దు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని కోరడానికి అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.

అమెరికా-జియోనిస్ట్-హిందుత్వ కూటమి నశించాలి!
పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేద్దాం!

పి.జె. జేమ్స్
ప్రధాన కార్యదర్శి
సీపీఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్.

న్యూఢిల్లీ
09.09.2025.
—————————————————————-
తెలుగు స్వేచ్ఛానుసరణ: కొల్లిపర వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యుడు సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్.93 92 32 56 52
vkollipara75@gmail.com

Related Posts

Leave a Comment