జoఝావతి ప్రాజెక్ట్ ని ఎప్పుడు పూర్తి చేస్తారు,
*CPi (ml) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి,
కామ్రేడ్ తోట జీవన్న
సూటి ప్రశ్న*
———————————– *జంఝావతి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని
CPi (ml)రెడ్ స్టార్ పార్టీ
త్వరలో కార్యాచరణ*
———————————–
ఒరిస్సా లో బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రా లో బీజేపీ అనుబంధ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడు జంఝావతి ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తి చేస్తాయో ప్రజలకు తెలియజేయాలనీ సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేసారు.
జంఝావతిపై ప్రకటనలు కాదు ముందు పనులు జరగాలి?..
అర్ధ శతాబ్దంగా ప్రకటనలు విని ప్రజలు విసుగెత్తిపోతున్నారు?
జంఝావతిపై పాలకులు, అధికారుల తీరు మారాలి?
చేతనైతే లిఫ్ట్ పని చేసేలా చర్యలు చేపట్టాలి?
ఒడిశా పేరుతో గత 50 ఏళ్లుగా జంఝావతిపై తాత్సారం?
కాలువల్లో పూడికలు, జంగిల్ క్లియరెన్స్ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం?
రబ్బరు డ్యాం, లిఫ్ట్ పనిచేస్తే పూర్తిస్థాయి సాగునీరు ఇవ్వొచ్చు? లాంటి ప్రశ్నలను సంధించారు.
శుక్రవారం పార్వతీపురంలో ఉన్న పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ-ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరమున్నర అవుతుంది. తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చేస్తాయి. తర్వాత
పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మరల సాధారణ ఎన్నికలు, మరల మొదటికే వస్తుంది, మరి ఇలాంటి సందర్బంలో
జంఝావతి ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తి చేస్తారో? ప్రజలకు చెప్పవలిసిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉందన్నారు. జంఝావతి ప్రాజెక్టు పూర్తి కాకపోవటంతో ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిగా కాక, వర్షాలు సకాలంలో కురవక, వ్యవసాయం లాభాదాయకంగా లేకపోవడంతో జంఝావతి ఆయకట్టు ప్రాంతాలకు చెందిన పలువురు రైతులు పెద్దపెద్ద పట్టణాలు హైదరాబాద్, చెన్నై విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలకు వలసపోయి కూలీలుగా, వాచ్ మెన్ లుగా మారారు అని అన్నారు. వారంతా వ్యవసాయానికి దూరమయ్యారన్నారు. ఒడిశా సమస్య సాకుతో అర్థ శతాబ్ద కాలంగా ఇక్కడ రైతులను మోసం చేస్తూ తొడుం తోలుకొస్తున్నారన్నారు. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జంఝావతి పూర్తిస్థాయి ఆయకట్టు 24,240 ఎకరాలకు సాగునీరు అందించేలా రబ్బర్ డ్యామ్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి రబ్బర్ డ్యాం ద్వారా 12 వేల ఎకరాలకు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 12 వేల ఎకరాలకు పూర్తిస్థాయి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారని అన్నారు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రబ్బర్ డ్యామును, లిఫ్ట్ ఇరిగేషన్ ను నిర్వహించలేని దుస్థితిలో ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కేవలం సుమారు 3, 4 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చే దుస్థితి ఉందన్నారు. ఇది కూడా కాకి లెక్కలేనని, అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. లిఫ్ట్ పూర్తిగా పడకేసిందన్నారు. ప్రకటనలు పక్కనపెట్టి అధికారులు, పాలకులు చేతనైతే లిఫ్ట్ పని చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లిఫ్ట్ పనిచేస్తుందని ప్రకటనలు ఇవ్వాలన్నారు. జంఝావతి నిర్వహణపై అధికారులు, పాలకుల తీరు మారాలన్నారు. ప్రకటనలతో ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన మానుకోవాలన్నారు. వేసవిలోనే జంఝావతి కాలువల్లో పూడిక తీతలు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరిన ఫలితం అంతంత మాత్రమే అన్నారు. మొక్కుబడిగా ఉపాధి హామీలో కొద్దిపాటి కంటి తుడుపు పనులు చేపట్టారన్నారు. లిఫ్ట్ అందుబాటులోకి తీసుకురాలేని, పూడికలు కాలువల్లో తీయలేని, గుర్రపు డెక్క తొలగించలేని దుస్థితిలో అధికారులు, పాలకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఒడిస్సా తో పాటు కేంద్రంలో, ఆంధ్రాలో కూటమి అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జంజావతి ప్రాజెక్టును వారు డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేసేలా పాలకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేసి తమది రైతు ప్రభుత్వం అని చేతల్లో నిరూపించాలన్నారు. జంఝావతి ద్వారా వృధాగా పోతున్న నీటిని పరిశీలించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎమ్ ఎల్ ) రెడ్ స్టార్ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, బొత్స మోహన్ రావు, జి. జనార్దన్, ఏ. సీతమ్మ, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
