Home » 27 -9 -2025న జంగారెడ్డిగూడెంలో జరుగు “ఫాసిస్టు వ్యతిరేక రాష్ట్ర సదస్సు”ను జయప్రదం చేయండి- ఆహ్వాన సంఘ అధ్యక్షులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ రాజేంద్రప్రసాద్ పిలుపు!

27 -9 -2025న జంగారెడ్డిగూడెంలో జరుగు “ఫాసిస్టు వ్యతిరేక రాష్ట్ర సదస్సు”ను జయప్రదం చేయండి- ఆహ్వాన సంఘ అధ్యక్షులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ రాజేంద్రప్రసాద్ పిలుపు!

by admin

కొయ్యలగూడెం:8-9-2025

27 -9 -2025న జంగారెడ్డిగూడెంలో జరుగు “ఫాసిస్టు వ్యతిరేక రాష్ట్ర సదస్సు”ను జయప్రదం చేయండి- ఆహ్వాన సంఘ అధ్యక్షులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ రాజేంద్రప్రసాద్ పిలుపు!

ఈరోజు కొయ్యలగూడెం లో “రాష్ట్ర ఫాసిస్టు వ్యతిరేక సదస్సు” ఆహ్వాన సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆహ్వాన సంఘ ఉపాధ్యక్షులు మాదేపల్లి వెంకటరత్నం అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి ఆహ్వానసంఘ అధ్యక్షులు శ్రీ యెలికే రాజేంద్రప్రసాద్ ( ప్రముఖ సీనియర్ న్యాయవాది )మానవ హక్కుల వేదిక ఏలూరు జిల్లా కమిటీ కన్వీనర్ ఈ సమావేశంలో మాట్లాడారు
.
ఆహ్వాన సంఘ అధ్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సందర్భంగా ఉపన్యసిస్తూ ప్రపంచంలో ఇప్పటివరకు ఫాసిస్టులకు అనేక విధాలుగా ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఫాసిస్టు నియంతలను ఎర్రసైన్యం ఓడించింది .అయితే ఇప్పుడున్న ఫాసిజం మతోన్మాద రూపం తీసుకుని ప్రజలను ఇతర మతస్తులపై దాడులు చేస్తూ హిందూ రాజ్యం స్థాపన చేయాలని బిజెపి దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయి. ఇలాంటి నియంతృత్వానికి దేశంలోని గిరిజన, ఆదివాసి ,దళిత, ముస్లిం, మైనా మైనార్టీలపై దాడులు చేస్తూ భయానక పరిస్థితులు సృష్టించుచున్నారు; కనుక ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ,కళాకారులు, ప్రజాస్వామికవాదులు ,విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలందరూ హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నామన్నారు.

అలాగే సెప్టెంబర్ 27న జరగబోయే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ధనకుదనం రంగనాథం, ఉమ్మడి పశ్చిమగోదావరి రెడ్ స్టార్ట్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఆదివాసి భారత్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మడకం రామన్న తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘ సభ్యులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం,
8 -9- 2025

ఇట్లు,
ఉద్యమాభివందనములతో
యల్.కె. రాజేంద్రప్రసాద్,( ప్రముఖ న్యాయవాది), ఆహ్వాన సంఘ అధ్యక్షులు

Related Posts

Leave a Comment