Home » మహారాజశ్రీ గౌరవనీయులైన తహశీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ జంగారెడ్డిగూడెం వారి దివ్య సముఖమునకు

మహారాజశ్రీ గౌరవనీయులైన తహశీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ జంగారెడ్డిగూడెం వారి దివ్య సముఖమునకు

by admin

మహారాజశ్రీ గౌరవనీయులైన తహశీల్దార్ మరియు
మండల మేజిస్ట్రేట్ జంగారెడ్డిగూడెం వారి దివ్య సముఖమునకు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకట్రావు, అందుగుల వెంకటేశ్వరరావు, పోకా రాఘవులు, గొలిమే యేసు, పొడపాటి యేసు, లక్కాబత్తుల వెంకటేష్, చిలపర్తి గిరి, జొన్నకూటి వెంకటేశ్వరరావు మరియు కొంత మంది కనీస భూపతిలేని దళిత పేదలం సంయుక్తంగా వ్రాసి దాఖలు చేసుకున్న దరఖాస్తు విన్నపములు.

అయ్యా!

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం సీలింగ్ భూముల విషయంలో భూసంస్కరణల చట్టం ప్రకారం, 1975లో భూస్వామి (లేటు) చిన్నం నాగభూషణం, తండ్రి: (లేటు) రాజమన్నార్ ఆర్.యస్.ఆర్. దాఖలా ఉన్న తనకు చెందిన 400 ఎకరాల భూమిని తమ డిక్లరేషన్లో అప్పటి ల్యాండ్ రిఫారమ్స్ ట్రిబ్యునల్, కొవ్వూరు వారికి చూపించగా, సదరు కోర్టు వారు LCC No. 2379/KVR/75 ననుసరించి, సదరు నాగభూషణం నుండి సుమారు 232 ఎకరాల భూమిని, ల్యాండ్ సీలింగ్ భూమిగా నిర్ధారించి, పేదలకు పంచాల్సిందిగా తీర్పు నిచ్చారు. దీనితో సదరు భూస్వాములు LRT కొవ్వూరు వారు ఇచ్చిన తీర్పుపై LRATలో అప్పీలు చేయగా, అప్పీలు నెం. 1198/1976గా నమోదై, విచారణ జరిగి, సదరు 232 ఎకరాల భూమిలో సుమారు 20 యకరాల భూమిని కరువు ప్రాంత మినహాయింపు భూమిగా మినహాయిస్తూ ది.17.09.1977న LRAT వారు తీర్పునిచ్చారు. దీనితో తృప్తి చెందని భూస్వాములు గౌరవ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ వేయగా, పిటిషన్ నెం. 564/1978గా నమోదై, విచారణ జరిగి, గౌరవ LRAT ఏలూరు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం అమలు చేయవలసినదిగా తీర్పు నిచ్చారు. దీనితో కూడా తృప్తి చెందని భూస్వాములు గౌరవ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా, పిటిషన్ నెం.1073గా నమోదై, విచారణ జరిపి, LRAT ఏలూరు వారు ఇచ్చిన తీర్పును అమలు చేయవలసినదిగా 1983లో తీర్పునిచ్చారు. కాని, భూస్వాములతో కుమ్మక్కైన అవినీతి రెవిన్యూ అధికారుల, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీలింగ్ భూములను పేదలకు పంచకుండా, సదరు భూములను క్రయవిక్రయాలు జరుపుకొనుటకు భూస్వాములకు తోడ్పాటు నిచ్చి, సుప్రీంకోర్టు తీర్పు దిక్కార నేరానికి పాల్లపడ్డారు. 1983 నుండి 2004వ సంవత్సరం వరకు సదరు సీలింగ్ భూములను పంచలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామంలోని పేదలు, సదరు భూములను పేదలకు పంచాలని పంచాలని 2004లో పెద్ద ఎత్తున ఆందోళన చేయగా, దీనితో ఖంగుతిన్న రెవిన్యూ అధికారులు, భూస్వాములతో కుమ్మక్కై LRAT ఏలూరు వారు ఇచ్చిన తీర్పు కాపీలను మాయం చేసి, ఒరిజినల్ డిక్లరెంట్ సంతానంలోని కొంతమంది మైనారిటీ తీరని మరియు చనిపోయిన వారిని డిక్లరెంట్సుగా చూపించి (ఒరిజినల్ డిక్లరెంట్ చిన్నం నాగభూషణం ఇచ్చిన డిక్లరేషనన్ను మాయం చేసి) య. 119.09ట్లు భూమిని డిక్లరేషన్లో చూపించి, దానిలో 41 ఎకరాల భూమిని మాత్రం ల్యాండ్ సీలింగ్ భూమిగా నిర్ధారిస్తూ 2005లో LRT జంగారెడ్డిగూడెం వారు తప్పుడు తీర్పునిచ్చారు. దీనితో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీలింగ్ భూములను పేదలకు పంచాలని కోరుతూ పేదలందరూ మరొక్కసారి ఆందోళన చేయగా, ఆర్.యస్.నెం. 150 తదితర సర్వే నెంబర్ల లోని య. 57.46సెంట్లు భూమిని భూస్వాముల సంతానం 2005 డిక్లరేషన్లో చూపించలేదని, సదరు భూములపై MC No.4/2005(B) ననుసరించి ది.04.7.2005న సెక్షన్ 145 విధించి, సదరు భూములను పేదలకు పంచుతామని నమ్మించి ఇప్పటికీ పంచలేదు.
మరో ప్రక్క పంగిడిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని పూరా RS.NO. 222,215/1 లోని సుమారు 20 ఎకరాల సీలింగ్ భూమికి రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేయాలని సదరు భూములు ప్రైవేటు భూములు కాదని సదరు భూముల విషయమై విచారణ జరపాలని రెవెన్యూ డివిజనల్ అధికారి జంగారెడ్డిగూడెం వారిని ఆదేశిస్తూ అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వాణి మోహన్ గారు ది. 09-09-2011 న ఆదేశించి ఉన్నారు. మరోప్రక్క 1983 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిన్నం నాగభూషణంకు సంబంధించిన 232 ఎకరాలు సీలింగ్ మిగులు భూములు పంచాల్సి ఉండగా కోర్టు దిక్కారానికి పాల్పడి చిన్నం నాగభూషణం LRT కొవ్వూరు వారికి తన భూముల విషయమై డిక్లరేషన్ ఇచ్చిన నాటికి మైనారిటీ తీరని చిన్నం శివరాంప్రసాద్ , చిన్నం జగన్మోహనరావు, చిన్నం అనురాధ, మట్టె శారదావాణి ల నుండి
కంటిన్యూ ….2

//2//
2005లో కొత్తగా డిక్లరేషన్ తీసుకున్న కోర్టు ధిక్కారనేరానికి పాల్పడిన అప్పటి అవినీతి అధికారుల పైన ఉదహరించిన
వారి పేర్లు చిన్నం అనురాధ 2005 నాటికి మరణించగా మరణించిన సదురు అనురాధను డిక్లరంటుగా చూపించిన అవినీతి రెవెన్యూ అధికారులు ఆమెకు సుమారు 60 ఎకరములు సీలింగ్ మిగులు భూమి వాటా దారునిగా సృష్టించారు. దళిత పేదలమైన భూమిలేని నిరుపేదలం సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా కొంతకాలానికి అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి వారు 2005లో చిన్నం శివరాంప్రసాద్, చిన్నం జగన్మోహనరావులు LRT జంగారెడ్డిగూడెం వారికి పాల్స్ డిక్లరేషన్ ఇచ్చి అధికారులను మోసం చేశారని అనగా 232.07 ఎకరముల భూమిని అప్ప జెప్పాల్సి ఉండగా 119.69 సెంట్లు భూమి ఉన్నదని భూసంస్కరణల చట్టంలో 8(2) విభాగం కింద డిక్లరేషన్ దాఖలు చేశారని
కాబట్టి డిక్లరెంట్స్ అయిన చిన్నం శివరాంప్రసాద్, చిన్నం జగన్మోహనరావులు భూసంస్కరణల చట్టంలోని 17 విభాగమును పూర్తిగా ఉల్లంఘించారని మరియు దీనిపై సదరు డిక్లరంట్ సంజాయిషీ చెప్పాలని అలాకానిచో వారిపై భూ సంస్కరణలు నియమావళి 1974 లోని 18వ నియమం ప్రకారం వారిని కోర్టులో ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదో 15 రోజులలో RDO గారి ఎదుట వ్రాతపూర్వకమైన సంజాయిషీ ఇవ్వవలసినదిగా సదరు RDO జంగారెడ్డిగూడెం వారు చిన్నం శివరాం ప్రసాద్, చిన్నం జగన్మోహనరావు లను ఆదేశిస్తూ రి.క నెం.156/2011/A ననుసరించి ది. 05-02-2011 వ తారీకున 2005లో ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చిన భూస్వాములకు సంజాయిషీ నోటీసులు జారీ చేసి ఉన్నారు. కానీ దళిత పేదల ఫిర్యాదుల వల్ల నోటీసులు జారీ చేసిన అధికారులే వాటిపై ఎటువంటి విచారణ చేపట్టకుండా భూస్వాముల డబ్బు రాజకీయ బలానికి లొంగిపోయి సీలింగ్ మిగుల భూముల సమస్యను ప్రక్కదోవ పట్టించి భూములను పరిరక్షించవలసిన అధికారులు అవినీతికి పాల్పడి సీలింగ్ మిగులు భూములు పేదలకు దక్కకుండా భూస్వాములతో కుమ్మక్కయి అడ్డుపడుతున్నారు.
మరోప్రక్క చిన్నం నాగభూషణం LRT కొవ్వూరు వారికి డిక్లరేషన్ ఇచ్చిన నాటికి మైనారిటీ తీరని మట్టే శారదారాణి ని 2005 డిక్లరెంట్ గా చూపించి ఆమె వాటాకు సుమారు 70 ఎకరములు కట్టబెట్టిన సీలింగ్ భూములలోని RS.NO. 215/3, 215/4 లోని సుమారు 32 ఎకరముల భూమిని పంగిడిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వెంకటనారాయణ రాజు తండ్రి సుబ్బరాజు సదరు 32 ఎకరముల సీలింగ్ భూమికి ఎటువంటి పత్రాలు లేకుండా సదరు సీలింగ్ భూమిని కబ్జా చేయడానికి పూనుకొనగా సదరు విషయమై పేదలు దానిని అడ్డుకొని సదరు భూమిని స్వాధీనం చేసుకొని దళిత పేదలు సాగుచేసుకొనుచుండగా సదరు నారాయణరాజుకు సాగుదారులైన దళిత పేదలకు జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరుగుతుండగా అప్పటి VRO వెంకట్, అప్పటి తహశీల్దార్ B S N రెడ్డి, అప్పటి RDO N.సత్యనారాయణ గార్లు భూస్వాములు వద్ద పెద్ద మొత్తంలో లంచాలు మ్రింగి చట్టవిరుద్ధంగా అక్రమ పద్దతిలో జంగారెడ్డిగూడెం కోర్టు లోను, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను అందుగుల విమల తదితరులు వాదులుగా గవర్నమెంట్ వారు ప్రతివాదులుగా విచారణ జరుగుతుండగా సదరు నారాయణ రాజు వారి తాలూకా వారైనా దాట్ల వెంకటలక్ష్మి హరిణి, సాగి వెంకట సత్యనారాయణ రాజు తదితరులకు కోర్టు ధిక్కారనేరానికి, అవినీతికి పాల్పడి అక్రమ పద్ధతిలో పట్టాదార్ పాస పుస్తకములు మంజూరు చేసి భూస్వాములకు తోడ్పాటును ఇచ్చారు. దీనిపై కూడా MRO నుండి ఉన్నతాధికారి అయిన అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వారికి RS.NO. 215/3, 215/4 లోని 32 ఎకరాల సాగుదారులుగా ఉన్న దళిత పేదలు ఫిర్యాదు చేసినా అప్పటి జాయింట్ కలెక్టర్ వారు సంబంధిత MRO గారికి సంజాయిషీ నోటీసు జారీ చేసి ఎటువంటి విచారణ జరిపి ఉండలేదు. మరియు ఎటువంటి చర్యలు సంబందిత అధికారులపై తీసుకొనలేదు.
దీనితో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీలింగ్ మిగులు భూమిని పంచకుండా తత్సారం చేస్తూ అగ్రకుల భూస్వాములకు తోడ్పాటు ఇస్తున్న అధికారుల తీరుతో విసుగుచెంది RS.NO. పూరా నెం. 222, 215/1 లోని 20 ఎకరాల సీలింగ్ భూమిని 2014 లో స్వాధీనం చేసుకొని పేదలు సాగు చేసుకుంటున్నారు. దీనితో సదరు సీలింగ్ భూమిని కాజేయాలని దురుద్దేశంతో ఉన్న పంగిడిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల నరసింహారెడ్డి, దాట్ల వెంకట సత్య తిరుపతి రాజులు సదరు సీలింగ్ భూమికి 2005లో LRT జంగారెడ్డిగూడెం వారికి ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చి అధికారులను మోసం చేసిన చిన్నం శివరాంప్రసాద్ తో అప్పటి MRO G V V సత్యనారాయణ గారి సమక్షంలో వారు ఒక కవులు పత్రం వ్రాయించుకుని దానికి అధికారులతో కౌలు కార్డులు పొంది 2014 సంవత్సరం నుండి సాగులో ఉన్న దళిత పేదలను సీలింగ్ భూముల సాగు నుండి తొలగించడానికి కుట్రపన్ని 2014 లో WPSR NO 126991/2014 లో హైకోర్టులో స్టే పొందడానికి జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఇంజక్షన్ పొందటానికి సదరు అధికారులు అక్రమ
కంటిన్యూ ….3

//3//
పద్ధతిలో సీలింగ్ భూములకు ఇచ్చిన కౌలు కార్డులతో కుట్ర చేయగా గౌరవ కోర్టుల వారు అందుగుల విమల వాదిగా ఉన్న కేసులో చర్చించవలసిందిగా హైకోర్టు వారు తెలుపగా జంగారెడ్డిగూడెం కోర్టు వారు వారి పిటిషన్ కొట్టి వేసినారు.
దీనితో కంగుతిన్న కొప్పుల నరసింహారెడ్డి, దాట్ల వెంకట సత్య తిరుపతి రాజులు సంబందిత రెవెన్యూ అధికారులను లోపరచుకొని సదరు RS .NO . 222, 215/1 లోని భూమిలో దళితులు సాగు చేస్తుండగా సదరు సీలింగ్ భూమికి పాల్స్ డిక్లరేషన్ ఇచ్చిన చిన్నం శివరాంప్రసాద్ తో తన కుమారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి సదరు భూమిని పూరా నెంబర్లైన RS .NO . 222, 215/1 లను సబ్ డివిజన్ చేయించి ఆ విధంగా చిన్నం శివరాంప్రసాద్ కుమారులైన చిన్నం సాయి హరీష్, చిన్నం రాజగోపాల కార్తీక్, తో కొప్పుల నరసింహారెడ్డి తాలూకా వారైనా సబ్బెళ్ళ శైలజ , ఆర్తమూరి కృష్ణవేణి లకు మరియు దాట్ల వెంకట సత్య తిరుపతి రాజు తాలూకా వారైనా దాట్ల పద్మకు అక్రమ పద్ధతిలో రెవెన్యూ అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ పొందినట్లు తద్వారా వారి పేరు మీద వారు సాగులో లేకపోయినా సాగుదారులుగా దళిత పేదలు ఉండగా సీలింగ్ మిగులు భూమికి పట్టాదారు పాసు పుస్తకములు పొందటానికి కుట్ర చేయగా వారు సాగులో లేనందున మరియు సదరు సర్వే నంబర్లు గల సీలింగ్ మిగులు భూముల విషయం గౌరవ హైకోర్టులో లోకాయుక్త కోర్టులో విచారణ జరుగుతున్నందున వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వటానికి వీలుపడదని రెవెన్యూ అధికారులు తెలిపి ఉన్నారు.
సదరు విషయమై అనగా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో చిన్నం నాగభూషణం కు సంబంధించిన సీలింగ్ మిగులు భూములు విషయమై 1975 LRT కొవ్వూరు వారి తీర్పు నుండి 1983 గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వరకు జరిగిన ఒక అవకతవకలపై, అక్రమాలపై రెవెన్యూ అధికారుల అవినీతిపై గౌరవ సుప్రీంకోర్టు ధిక్కార నేరం పై పంగిడిగూడెం గ్రామ వాసినైన జొన్నకూటి వెంకటేశ్వరరావు అను నేను గౌరవ లోకాయుక్త కోర్టును ఆశ్రయించగా పిటిషన్ నెంబర్ 856/2018/B1 గా నమోదయి విచారణ జరుపగా సదరు విచారణ సమయంలో తహసీల్దార్ జంగారెడ్డిగూడెం నుండి ఉన్నతాధికారులైన కలెక్టర్ వారు వరకు వారి వద్దనున్న రికార్డులు లోకాయుక్తవారికి సమర్పించగా సదరు రికార్డుల ఆధారంగా దళిత పేదలు సాగులో ఉన్న RS .NO. 222, 215/1 లోని భూములతో పాటు తదితర సర్వే నెంబర్లలోని సుమారు 90 ఎకరాల సీలింగ్ భూములకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయవలసిందిగా మద్యంతరపు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. సదరు మద్యంతరపు ఉత్తర్వులపై పైన ఉదాహరించిన సర్వే నెంబర్లు గల సీలింగ్ భూములను కాజేయాలని దురుద్దేశ్యంతో కొప్పుల శ్రీనివాసరెడ్డి, గోలి కిషోర్ రెడ్డి, సబ్బిళ్ళ శైలజ, దాట్ల లక్ష్మి, ఆర్తమూరి కృష్ణవేణి తదితరులు గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించగా WP NO 12445/2023 గా నమోదయి విచారణ జరిగి గౌరవ హైకోర్టు వారు సదరు లోకాయుక్త కోర్టు వారికి మద్యంతరపు ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని ఫైనల్ ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపి ఉన్నారు.
సదరు విషయమై విచారణ జరిపిన లోకాయుక్త కోర్టు వారు పిటిషన్ C.NO. 856/2018/B1 పిటీషన్ను క్లోజ్ చేస్తూ గౌరవ హైకోర్టులో WP NO 12445/2023 పెండింగ్ ఉన్నందున సదరు హైకోర్టులో తేల్చుకోవాల్సినదిగా సదరు లోకాయుక్త కోర్టు వారు తెలిపి ఉన్నారు. అందులో సదరు హైకోర్టు వారు వాద, ప్రతివాదుల వాదనలపై విచారణ జరిపి పంగిడిగూడెం సీలింగ్ భూముల విషయంలో LRT కొవ్వూరు. LRAT ఏలూరు రివిజన్ పిటిషన్ అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పెషల్ లీవ్ పిటీషన్, గౌరవ సుప్రీంకోర్టు తదితర కోర్టుల తీర్పులను పరిగణలోకి తీసుకొని ఆ విధంగా అనగా భూసంస్కరణల చట్టం ప్రకారం చిన్నం నాగభూషణం ఇచ్చిన డిక్లరేషన్ నుండి సుప్రీంకోర్టు తీర్పులు ఉండగా LCC NO. 2379/75/KVR ననుసరించి మరలా LRT జంగారెడ్డిగూడెం వారు ఎందుకు తీర్పు 2005న ఇవ్వవలసి వచ్చినదో మరియు 2005లో ఇచ్చిన పాల్స్ డిక్లరేషన్ 2011లో ఇచ్చిన సంజాయిషీ పై సీలింగ్ భూముల విషయంలో చట్టవిరుద్ధంగా జరిగిన క్రయవిక్రయాలపై అక్రమ పద్ధతిలో మంజూరు చేసిన పాస్ పుస్తకాలపై అవినీతి అక్రమాలపై విచారణ జరిపి 1983 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ విధంగా సీలింగ్ మిగులు భూములను కనీసం భూవసతిలేని దళిత పేదలకు పంచేందుకు తగు చట్టపరమైన చర్యలు తీసుకొనవలసినదిగా ఏలూరు జిల్లా కలెక్టర్ వారికి డైరెక్షన్ ఇస్తూ గౌరవ హైకోర్టు వారు మార్చి నెల 2025 తారీకున ఉత్తర్వులు ఇచ్చి భూస్వాముల పిటిషన్ డిస్మిస్ చేసినారు.
గత మార్చి నుండి తమరు గానీ, RDO గారు గాని, జిల్లా కలెక్టర్ వారు గానీ గౌరవ హైకోర్టు తీర్పులను అమలు చేయకుండా కాలయాపన చేసినందున సదరు భూస్వాములు గౌరవ హైకోర్టు తీర్పులపై అప్పీలుకు వెళ్ళకుండా గౌరవ
కంటిన్యూ ….4

//4//
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ లో WP NO. 25596/2025 ననుసరించి రిట్ పిటీషన్ లో గౌరవ కోర్టు వారికి తప్పుడు సమాచారం ఇచ్చి అనగా సదరు LCC భూములలో దళిత పేదలు సాగుదారులుగా ఉండగా సుప్రీం కోర్టు పిటీషన్ నెం. 1073 జడ్జిమెంట్ కోర్టు వారికి సమర్పించకుండా పిటీషన్ దారులు సాగుచేసుకుంటున్నారని కోర్టు వారిని తప్పుదోవ పట్టించి క్రొత్త పిటీషన్ వేసి ప్రతివాదులుగా సదరు RS .NO. 222, 215/1 లోని సీలింగ్ భూమిని సాగు చేసుకుంటున్న మట్టపర్తి వెంకట్రావు మరియు 7 మందిని మరియు అధికారులను ప్రతివాదులుగా చేర్చి ప్రతివాదులకు ఎటువంటి నోటీసులు జారీ కాకుండా కోర్టు వారిని తప్పు దోవ పట్టించి మోసం చేసి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి 2005లో LRT జంగారెడ్డిగూడెం వారిచ్చిన తప్పుడు తీర్పులతో కనీసం గవర్నమెంట్ న్యాయవాది వాదనలు కూడా వినిపించనీయకుండా దళిత పేదలు సాగులో ఉన్న RS .NO. 222, 215/1 లోని సీలింగ్ భూములు వాదులైన దాట్ల లక్ష్మి, ఆర్తమూరి కృష్ణవేణి, సబ్బిళ్ళ శైలజ ల సీలింగ్ భూమికి సృష్టించిన రికార్డుతో కోర్టువారిని పక్కదోవ పట్టించి ఏకపక్షంగా తప్పుడు పద్ధతిలో గౌరవ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చినా జిల్లా కలెక్టర్ ఏలూరు వారు పట్టించుకోకపోవడం కారణంగా యాజ్ పర్ లా వంటి ఉత్తర్వులు పొంది పైవారలు భూమి యజమానులుగా సృష్టించుకోవడానికి కుట్ర పన్నుతూ దళిత పేదలు సదరు సీలింగ్ భూమిలో వేసిన వరి, వంగ, బెండ తదితర పంటలను భూస్వాముల డబ్బు రాజకీయ బలంతో ధ్వంసం చేయటానికి కుట్ర చేస్తూ ఈ పంటల ధ్వంసానికి పోలీసు ప్రొటెక్షన్ కొరకు అధికారులను బెదిరిస్తున్నట్లు తెలియ వచ్చినది.
కావున ఏలిన వారు మా దరఖాస్తు విన్నపాన్ని పరిశీలించి మేము మా దరఖాస్తులో పొందుపరచిన విషయాలపై పంగిడిగూడెంలోని భూమిలేని దళిత పేదలకు చెందాల్సిన 232 ఎకరముల సీలింగ్ భూములపై 1975 LRT కొవ్వూరు వారి తీర్పు నుండి 1983 గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వరకు జరిగిన కోర్టు ధిక్కారనేరాలపై, అవినీతి, అక్రమాలపై భూసంస్కరణల చట్టం ఏర్పడిన తరువాత జరిగిన భూక్రయవిక్రయాలపై చట్టబద్దమైన విచారణ జరపవలసినదిగాను మరియు RS .NO. 222, 215/1 లోని సుమారు 20 ఎకరాల సీలింగ్ భూములలో సాగులో ఉండి వరి మరియు వంగ, బెండ పంటలను సాగు చేసుకుంటున్న గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకట్రావు, జొన్నకోటి వెంకటేశ్వరరావు, పొడపాటి యేసు, అందుగుల వెంకటేశ్వరరావు, పోకా రాఘవులు తదితర 30 మంది పేర్లు సాగుదారులుగా అడంగల్ పహాణీలు నమోదు చేసి పట్టాలు మంజూరు చేయవలసినదిగాను WP NO. 12445/2023 ను అనుసరించి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జిల్లా కలెక్టర్ వారికి డైరెక్షన్ ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చినందున ఆప్రకారం 1983 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సీలింగ్ భూములు కనీసం భూవసతి లేని దళిత పేదలకు పంచిపెట్టవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ వారికి సిఫార్సు చేయవలసినదిగా తమ ఘనతను కోరి ప్రార్థించుచున్నాము.
ఇట్లు
పంగిడిగూడెం తమ విధేయులు
ది. 17-10-2025
( మట్టపర్తి వెంకట్రావు )
ఈ దరఖాస్తు నఖలు కాపీలను ఈ క్రింది వారికి సమర్పించడమైనది.
1. రెవెన్యూ డివిజినల్ అధికారి, జంగారెడ్డిగూడెం వారికి ( అందుగుల వెంకటేశ్వరరావు)
2. ఏలూరు జిల్లా కలెక్టర్, ఏలూరు వారికి
3. చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ( CCLA ) , ఆంధ్రప్రదేశ్ వారికి ( పోకా రాఘవులు )
4. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వారికి
5. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వారికి ( గొలిమే యేసు )
6. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి
7. గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యూడిల్లీ వారికి ( పొడపాటి యేసు )
8. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి
( లక్కాబత్తుల వెంకటేష్)

( చిలపర్తి గిరి )

( జొన్నకూటి వెంకటేశ్వరరావు )

Related Posts

Leave a Comment