Home » మన్యం జిల్లాలో బీభత్సo చేస్తున్న ఏనుగుల సమస్యను

మన్యం జిల్లాలో బీభత్సo చేస్తున్న ఏనుగుల సమస్యను

by admin

ప్రెస్ నోట్ : పార్వతీపురం
06-11-2025,
———————————–
మన్యం జిల్లాలో బీభత్సo చేస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరించాలని
శ్రీ కొణేదల పవన్ కళ్యాణ్ గారికి,
సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్ పార్టీ,
జిల్లా కార్యదర్శి,
తోట జీవన్న,

కుంకీ ఏనుగులను రప్పించి, పార్వతీపురం మన్యం జిల్లాలో బీభత్సం సృష్టిస్తూ, ఆస్తి, పంట, ప్రాణ నష్టాలకు కారణమైన ఏనుగులను అడవికి గాని, సంరక్షణ కేంద్రానికి(జూ కు)గాని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టవలసినదిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడం జరిగింది, ఈ సందర్బంగా మాట్లాడుతూ,,
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు రెండు జట్లుగా సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, ఏనుగుల వలన ఆస్తి, పంట, ప్రాణ నష్టం విపరీతంగా జరుగుతున్నది. 2017 లో ఒరిస్సా రాష్ట్రం నుండి రెండు జట్లుగా మన్యం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు చేస్తున్న దాడులు వలన ఇప్పటికీ గిరిజనులతో అటవీ సిబ్బందితో పాటు సహా 12 మంది చనిపోయారు, ఇందులో చిన్న పిల్లలతో సహా, గిరిజన రైతులు ఉన్నారు. అలాగే ఏనుగుల బీభత్సం వలన సుమారు రూ,, 6 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిలింది. ఏనుగుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు కంటతుడుపు నష్టపరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఏనుగులు దాడి చేసిన రెండు మూడు రోజులు జిల్లా అధికారులు హడావిడి చేసి, తర్వాత ఏనుగుల బెడదను శాశ్వతంగా నివారించేందుకు ఎటువంటి ప్రణాళికలు లేకపోవడంతో, మన్యంలో ఉంటున్న ప్రజలకు పగలు, రాత్రి కoటిమీద కునుకు లేకుండా బిక్కు బిక్కు మని కాలం వెళ్ళదీస్తున్నారు, ఏ రోజు, ఏ గ్రామం మీదకి ఏనుగులు వచ్చి దాడి చేస్తాయో! అని ప్రజలందరూ కూడా రాత్రులంట కాపలా కాయడం జరుగుతున్నది.
ఏనుగులు దాడులు చేస్తాయని భయంతో పిల్లలు స్కూలుకి వెళ్లలేకపోతున్నారు. ప్రజలు నిత్యవసర వస్తువుల కొనుగోలుకు, చికిత్స కోసం ఆసుపత్రులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, దినసరి పనులకు వెళ్ళలేక ప్రజలు నరక వేతన పడుతున్నారు, ఇప్పటివరకు మన్యం జిల్లాలో 12 మంది ప్రాణాలను బలి తీసుకోగా, 7 ఏనుగులు చనిపోయాయి, ఇoత జరుగుతున్నప్పటికీ ఏనుగులు జిల్లాలో సంచరించే ప్రాంతాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను సంబంధిత శాఖ అధికారులు తీసుకోకపోవడంతో, ప్రజలు, ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి, మన్యం జిల్లా అధికారులు వణ్యప్రాణ సంరక్షణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుంకీ ఏనుగులను రప్పించి మన్యం జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు రెండుసార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి
వచ్చియున్నారు. ఆ మధ్యకాలంలో పార్వతీపురం మండలం పెద్ద బండపల్లి గ్రామవాసి చనిపోతే మరుసటి రోజు
రూ,, 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు, 2017 నుంచి ఇప్పటివరకు ఏనుగుల దాడిలో 11 మంది చనిపోతే సరైన నష్టపరిహారం అందలేదని,బాదితులు, కుటుంబీకులు జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతూ, మొర పెట్టుకున్నప్పటికీ ఫలితము లేక పోతుంది. ఏనుగుల వలన జిల్లాలో రూ,, 6 కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరగగా, ఇంకా రూ,, 2 కోట్ల వరకు నష్ట బకాయిలు రైతులకు చల్లంచాల్సి ఉంది.
మన్యం జిల్లాలో ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే సీజను, అలాగే క్రిస్టమస్, సంక్రాంతి పండగలో వస్తున్నాయి. విద్యార్థులు సెలవులకు రావడం జరుగుతుంది. బంధువులు రాకపోకలు జరుగుతాయి. ఈ సందర్భంలోనే జిల్లాలో ఏనుగులు
విజ్రoబించి సంచరిస్తుండడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోవడం జరుగుతున్నది.
కావున, మీరు వెంటనే స్పందించి కర్ణాటక రాష్ట్రం నుండి కుంకి ఏనుగులను రప్పించి మన్యం జిల్లాలో రెండు జట్లుగా సంచరిస్తూ బీభత్సం చేస్తున్న ఏనుగులను అడవికి గాని, సంరక్షణ కేంద్రాలకు(జూ కు) గాని తరలించే విదంగా చర్యలు తీసుకోగలరు. ఏనుగుల దాడిలో చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగo కల్పించి ఆదుకునేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు, ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, బిడ్డక రమణ మూర్తి, పత్తిక మోహన్ రావు, అరినాన సీతమ్మ తదితరులు పాల్గొన్నారు,,,

Related Posts

Leave a Comment