Home » 18 తారీకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన తెలంగాణ బంద్ ను జయప్రదం చేయండి!– మన్నవ హరిప్రసాద్ , పొలిట్ బ్యూరో సభ్యుడు,సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ప్రకటన

18 తారీకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన తెలంగాణ బంద్ ను జయప్రదం చేయండి!– మన్నవ హరిప్రసాద్ , పొలిట్ బ్యూరో సభ్యుడు,సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ప్రకటన

by admin

18 తారీకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన తెలంగాణ బంద్ ను జయప్రదం చేయండి!–

మన్నవ హరిప్రసాద్ , పొలిట్ బ్యూరో సభ్యుడు,సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ప్రకటన

సిపిఐ ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ స్థానిక సంస్థలలో వెనుకబడిన వర్గాలకు (BCs) 42% రిజర్వేషన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 ని బలపరుస్తున్నది. దీనిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్పరులు నిలుపుదల చేయాలని కోరుచున్నది. అదేవిధంగా జీవో 9 ప్రకారం తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని సిపిఐ(ఎంఎల్) రెడ్ స్టార్ డిమాండ్ చేస్తున్నది. బీసీలు స్థానిక సంస్థల్లో వారి వాటా కోసం చేసిన డిమాండ్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే వెనుకబడిన కులాల జాయింట్ యాక్షన్ కమిటీ (BC-JAC) పిలుపునిచ్చిన అక్టోబర్ 18 రాష్ట్రవ్యాప్తంగా జరిగే బంద్‌కు సిపిఐ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ తన సంపూర్ణ మద్దతును తెలియ చేస్తోన్నది. ఈ పిలుపు వెనుకబడిన వర్గాల, కులాల ఒక విభాగం కోరిక మాత్రమే కాదు – ఇది అణచివేత, దోపిడీ, మరియు కుల, వర్గ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల సామూహిక పోరాటానికి శక్తివంతమైన వ్యక్తీకరణ.

తెలంగాణ లో, వెనుకబడిన కులాల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం మళ్లీ సామాన్య సమానత్వం మరియు సమ న్యాయానికి సంకేతంగా మారింది. పాలక వర్గాలు సంవత్సరాల తరబడి అణచివేసిన దళిత, వెనుకబడిన వర్గాల స్వరం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గౌరవం మరియు సామాజిక మార్పు కోసం గర్జనగా మారింది. వెనుకబడిన కులాల రిజర్వేషన్ ప్రశ్న కేవలం ఒక చట్టపరమైన లేదా పరిపాలనా విషయం మాత్రమే కాదు – ఇది ఆర్థిక, సామాజిక, రాజకీయంగా బలపడటం కోసం కార్మిక ప్రజలు సాగిస్తున్న చారిత్రక పోరాటంలో భాగమైన నైతిక మరియు రాజకీయ హక్కు.

హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగ న్యాయస్ఫూర్తిని, ఆదేశిక సూత్రాలను అనుసరించి వ్యవహరించాలని, అధికారం మరియు వనరులపై ఆధిపత్యం కొనసాగించాలని ప్రయత్నించే ఆధిపత్య ప్రభుత్వ వర్గాల ప్రయోజనాలకు తలవంచకూడదని సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ప్రకటిస్తున్నది. 42% వెనుకబడిన కులాల రిజర్వేషన్ డిమాండ్ శతాబ్దాలుగా కొనసాగుతున్న జాతి లేదా కుల ఆధారిత దోపిడీని కూల్చివేయడానికి, ఈ దేశానికి వెన్నెముక అయిన శ్రామికులకు న్యాయాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన కీలకమైన ఒక ముందు అడుగు.

బీసీ సంఘాలు మరియు ప్రజాస్వామ్య శక్తులు వెనుకబడిన కులాల జాయింట్ యాక్షన్ కమిటీ(BC- JAC) పతాకం కింద ఐక్యమై ప్రజా ఐక్యతను చూపినందుకు మేము అభినందిస్తున్నాము. అక్టోబర్ 18 బంద్ పిలుపు ఒక న్యాయమైన ప్రజా ప్రతిఘటన చర్య, వర్గ పాలకులు మరియు కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడిన ప్రభుత్వాలు సంవత్సరాలుగా దోచుకున్న హక్కులను తిరిగి పొందే పోరాటం.

సిపిఐ (ఎం.ఎల్ )రెడ్ స్టార్ అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య మరియు విప్లవ శక్తులను ఈ ప్రజా ఉద్యమానికి క్రియాశీల మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తుంది. ప్రతి గ్రామం, పట్టణం, పనిస్థలం “ వెనుకబడిన కులాలకు(BCలకు) న్యాయం – ప్రజలకు అధికారం!” అనే నినాదంతో మార్మోగాలి.

ఇది దానం కోసం చేసే ఉద్యమం కాదు – ఇది హక్కుల కోసం జరిగే విప్లవాత్మక పోరాటం.

ఈ ఉద్యమం ప్రతి శ్రామిక , రైతు, విద్యార్థి, అణగారిన పౌరుడిని మేల్కొలపాలి.
వెనుకబడిన కులాల(BCల) విజయం శ్రామికుల విజయంలో భాగమే!!
అణగారిన కులాల ఐక్యత వర్ధిలాల్లి !!
సామాజిక న్యాయం కోసం పోరాటం వర్ధిలాల్లి!!,
కుల- వర్గ దోపిడీ అంతమవ్వాలి!!
ఇంక్విలాబ్ జిందాబాద్!!

ఇట్లు,
అభినందనలతో
మన్నవ హరిప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యుడు సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ,
8247728296,
17-10-’25,

Related Posts

Leave a Comment