ఈరోజు
27- 9- 2025 సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫాసిస్ట్ వ్యతిరేక రాష్ట్ర సదస్సు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సిపిఐ (ఎం.ఎల్ )రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి , జొన్నకూటి వెంకటేశ్వరరావ అధ్యక్షతన జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు వై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పాలకవర్గాలు ఈ దేశంలోనూ ఉద్యమాలను, ఉద్యమించే వారిని అణచివేస్తూ, కార్పొరేట్లకు మేలు చేసేందుకు ఊడిగం చేస్తున్నాయని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ ఎన్ శ్రీమన్నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ ఎన్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ,
ఈరోజు ముఖ్యంగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయింది, అయితే ఆర్ఎస్ఎస్ మూలాలు లోతుగా పోయినట్లయితే ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదాలను చేస్తూ ప్రజలను మతాల పేరుతో మార్చి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చి ఇక్కడ ఇతర మతాలను హత్యలు చేస్తూ, ఒక భయానిక పరిస్థితులు సృష్టిస్తూ, ప్రగతిశీల శక్తులను అంతమొందించేందుకు కుట్రలు చేస్తూ, హత్యలు చేస్తూ, తన మనువాద భావాజాలాన్ని దేశంలోన ప్రజల పైన బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు, హిందూ మత ఆదిపత్యాన్ని చెలయించి మనువాద భావజాలాన్ని కుల వ్యవస్థను పెంచి పోషించి దళితులను మైనారిటీలను అనగదొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచే
శారు
భారత రాజ్యాంగoలో ఆర్టికల్ 14 ” రూల్ ఆఫ్ లా” అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తిలోదికాలిస్తున్నారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నదని పిలుపునిచ్చారు.
మరోముఖ్య వక్త సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ పోలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్ మాట్లాడుతూ, సామ్రాజ్యవాదం అంటే పెట్టుబడిదారి విధానము అత్యున్నత దశే అని లెనిన్ మహాశయుడు చెబుతూ, పెట్టుబడిదారీ విధానం యొక్క క్రూరమైన అణిచివేతే ఫాసిజం అని అన్నారని ఆయన అన్నారు.
పాసిజమంటే మతాన్ని, మత విశ్వాసాలను వాడుకుంటూ పెట్టుబడిదారులకు సేవ చేయడమే దాని ఉద్దేశమని అందులకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ,జగన్మోహన్ రెడ్డి, అందరూ ఫాసిస్టు శక్తులకు అనుకూలరేరని, ఈ విషయాలను మనం గుర్తించుకొని సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
హిందూ మతోన్మాదం పేరుతో అంబాని,ఆదానీ కార్పోరేట్ల సేవ చేయటమే నరేంద్ర మోడీ/ ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఇస్లాం ఫోబియాని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ముస్లిం క్రైస్తవ హరిజన గిరిజన మైనార్టీలకు రక్షణ లేదని ఆయన అన్నారు.
ఇంకా ఈ సభలో డాక్టర్ అలుగు ఆనంద శేఖర్ సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి కొల్లిపర వెంకటేశ్వరరావు రాష్ట్ర నాయకులు రంగనాథం, మాదేపల్లి వెంకటరత్నం, భీమవరపు సుబ్బారావు, తోట జీవన్న, పలనాడు జిల్లా నాయకులు గురుపుశాల రమణయ్య, వెనిగళ్ల పుష్పలత, వీరవల్లి సారా, మడకం రామన్న ధర్మారావు, సిపిఐ (ఎం.ఎల్)రెడ్ స్టార్ స్థానిక నాయకులు మందలపల్లి రాజు, తామర సత్యనారాయణ, లాగు కుటుంబరావు, నారాశి ఆనందరావు తదితరులు మాట్లాడారు.
