04-11-2025
షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన హక్కులన్నీ పగడ్బoదీగా అమలు చేయాలి,
ఎల్విన్ పేట సెంటర్లో గిరిజనులు నిరాహార దీక్ష,
షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన హక్కులన్నీ పగడ్బందీగా అమలు చేయాలని ఆదివాసి భారత్ మహాసభ (ఏ బీ ఎమ్) జిల్లా కన్వీనర్ బిడ్డకి రమణ మూర్తి డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా బిడ్డకి రమణ మూర్తి మాట్లాడుతూ,,
ఎల్విని పేట సెంటర్లో ఆదివాసీ భారత మహాసభ (ఏ బీ ఎమ్) ఆధ్వర్యంలో గిరిజనులతో నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని గిరిజన చట్టాలు పగడ్బందీగా అమలు అయ్యేంతవరకు, షెడ్యూల్డ్ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ చేస్తున్న అరాచకాలను అరికట్టేంతవరకు కూడా ఆదివాసి భారత్ మహాసభ తరఫున ఉద్యమిస్తామని అన్నారు, ఈరోజు నిరాహార దీక్షతో ప్రారంభించిన ఈ ఉద్యమం రానున్న రోజుల్లో గిరిజన ప్రజానీకమును చైతన్యపరిచి ఈ ఉద్యమంలో పాలుపంచుకునే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు, హక్కులు సాధించుకునే విధంగా సంఘం తరఫున ప్రయత్నం చేస్తామని అన్నారు,షెడ్యూల్లో ప్రాంతంలో గిరిజన హక్కులకు భంగం కలిగించే విధానాలపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, గుమ్మలక్ష్మీపురం మండలం షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ, గిరిజన భూములు గిరిజనులకే చెందాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కొంతమంది నాన్ ట్రైబల్స్ నిబంధనలను అధిగమించి అక్రమంగా పక్కా ఇల్లులు నిర్మించడం, గిరిజన యువతకే ఉపాధి కల్పించే దుకాణాల సముదాయ స్థానములో అక్రమంగా పట్టాలు సృష్టించి షాపులు
నిర్మించుకొని వ్యాపారాలు చేస్తుండటం చూస్తుంటే గిరిజన హక్కులను కాలరాయిడమేనని అన్నారు, నిరాహార దీక్షకు మద్దతుగా సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న మద్దతు తెలుపుతూ మాట్లాడడం జరిగింది, కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు కూడబలుక్కొని గిరిజన హక్కులను కాల రాస్తున్నారని అన్నారు, గుమ్మలక్ష్మీపురం మండలం షెడ్యూల్డ్ ప్రాంతం అయినప్పటికీ అమాయక గిరిజనుల పైన నాన్ ట్రైబల్స్ కొంతమంది పెద్దరికం చేస్తూ వాళ్లకున్న హక్కుల పైన, వాళ్లకున్న భూములు పైన పెత్తనం చేస్తూ దోపిడి చేస్తున్నారని అన్నారు, షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన భూములు గిరిజనులకే చెందాలని చట్టం చెపుతున్నప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ కి స్థలాలపై పట్టాలు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు, దీనిపైన పార్టీ తరఫున హైకోర్టుకు వెళతామని అన్నారు, గిరిజన ప్రాంతంలో ఒకనాడు గిరిజన ఉద్యమం జరిగిందని ఆ ఉద్యమం ఫలితంగానే అనేక చట్టాలు సాధించుకున్నారని తద్వారా ఐ టీ డి ఏ, జీసీసీలు, సంక్షేమ హాస్టల్లు, చదువుకున్న గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు పోరాట ఫలితమేనని అన్నారు అనేకమంది పోరాటం చేసి సాధించిన ఫలితాలు నేడు అన్యాయంగా కాలు రాస్తున్నారని అన్నారు, గిరిజన యువత ఈ విషయాలన్నీ తెలుసుకొని ఉన్న హక్కులన్నీ కాపాడుకోవడానికి నడుం బిగించి ముందుకు రావాల్సిందని అన్నారు, ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలోజిల్లా కార్యవర్గ సభ్యులు
గరుగుబిల్లి సూరయ్య,
బిడ్డక రమణ మూర్తి
పత్తిక మోహన్ రావు
పాల్గొన్నారు,,
