Home » సెప్టెంబర్ 27 జంగారెడ్డిగూడెంలో  జరిగిన సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు తీర్మానాలు

సెప్టెంబర్ 27 జంగారెడ్డిగూడెంలో  జరిగిన సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు తీర్మానాలు

by admin

సెప్టెంబర్ 27 జంగారెడ్డిగూడెంలో  జరిగిన సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు తీర్మానాలు

1. అమెరికా సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయిల్  పాలస్తీనా దేశం పైన, ప్రజల పైన మారణ హోమం సృష్టిస్తున్నది. దాదాపు 50 వేల మందికి  ప్రజల పైగా  ఇజ్రాయిల్ దాడుల్లో మరణించారు. అమెరికా- ఇజ్రాయిల్  చేస్తున్న  దారుణ  కాండను  ఈ సదస్సు ఖండిస్తున్నది.

2.పాలస్తీనా ప్రజలకు  ఈ సదస్సు ద్వారా సంఘీభావాన్ని తెలియజేస్తున్నది.

3.  1973  భూ గరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేసి,  సీలింగ్ పట్టాలు పొందిన లబ్ధిదారులకు భూములు అప్పగించాలి.

4.. 1/70 ఆదివాసి సాగులో ఉన్న భూములకు అటవీ హక్కులు చట్టం అమలు చేసి సర్వే జరిపిన భూములకు వెంటనే ఆరో ఎఫ్ ఆర్వెంటనే ROFR పట్టాలు ఇవ్వాలి,

5. అసైన్మెంట్ చట్టం అమలు చేసి, ఎస్సీలకు ఇచ్చిన భూములు వారికే తిరిగి అప్పగించాలి.

6. ప్రభుత్వ భూములను కారు చౌకగా పెట్టుబడి దారులకు , కార్పొరేట్లకు అప్పగించటాన్ని   ఈ రాష్ట్ర సదస్సు తీవ్రంగా ఖండిస్తున్నాము.

7. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లంచాల్సిన నష్టపరిహారాలు పూర్తిగా చెల్లించి, వారికి ఇవ్వబడ్డ భూములు వారికి స్వాధీనపరిచి, ఆన్లైన్ చేసి, భూ అభివృద్ధికి నిధులు ఇచ్చి, విద్యుత్తు, నీటి సౌకర్యం, రవాణా, విద్య, వైద్య, ఉపాధి కల్పించి ఆదుకోవాలి.

8.ఆదివాసి యువతి యువకులకు skill development కేంద్రాలలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చి ఉపాధులు కల్పించాలి.

9.. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం, కొయ్యలగూడెం, మండలం బుల్లెంపేట, కన్నాపురం గ్రామాల్లో భూములకు పోరాడుతున్న ప్రజలకు భూములను నిరుపేద ప్రజలకు పంచాలి.

10. గోపాలపురం మండలం కరగ పాడు భూములకై పోరాడుతున్న రెవెన్యూ భూమిని పేదలకు పెంచాలి.

11. పెదవేగి మండలం కొండాలరావుపురం  రెవెన్యూ భూములలో 60 సంవత్సరాల నుండి పోరాడుతున్న సాగుదారులకు భూములపై పట్టాలి ఇచ్చి, భూములు పంచిపెట్టాలి.

12. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల వల్ల తరచుగా ప్రమాదాల జరుగుతున్న కారణంగా రవాణా సదుపాయం కల్పించుటకు రోడ్లు నిర్మాణం జరిపించి ప్రమాదాలు నివారించాల్సిందిగా ప్రభుత్వం వెంటనే రోడ్ నిర్మించాలని,
అదే విధంగా ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలనీ

13. తారకరామా ప్రాజెక్ట్  పూర్తి కొరకు బడ్జెట్ కేటాయించి, ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి  నష్టహరిహారం చెల్లించాలనీ, ప్రాజెక్టును పూర్తి చేయాలనీ.

14.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గురించి విధాన నిర్మించుకోవాలి. 23 భాగాలుగా విభజించి కారు చావుగా అమ్మడాన్ని ఆపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు అత్యధిక లాభాలు వైపు నడిపించే తన రక్త మాంసాలను జారబోసే పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులను పనిలో కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నీరు గారిచే విధంగా విశాఖ ఉక్కును సాధించడం కోసం ప్రాణాలర్పించిన  32 మంది అమరవీరుల ఆశయాలను సమాధి చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పుకొట్టాలి. సొంత గునులు కేటాయించాలి.

15. ఉత్తరాంధ్రలో మూతపడిన ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలను తెరిపించాలి. ఆంధ్ర పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు  మూతబడిన ఉన్న  ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలను దత్తత తీసుకొని నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

16. సహకార రంగంలో నడుస్తున్నటువంటి సంకిలి బీమసింగ్ లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే విధంగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
చెరుకు పండించే రైతులకు ప్రోత్సాహకాలు పెంచి చెరుకును షుగర్ ఫ్యాక్టరీలకు సరిపడే విధంగా పండించే ప్రభుత్వ విధానాలు రూపొందించాలి

పార్వతీపురం మన్యం జిల్లా లో ఉన్న నాలుగు నియోజకవర్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఈ సదస్సు తీర్మానం చేస్తున్నది.

17.ప్రకృతి వనరుల విద్వoసం
( ఆత్యం మైనింగ్, బడిదేవర కొండ గ్రానైట్, వెలుగుల మెట్ట) ఆపాలని,

18.జిల్లాలో  (గుంతలు పడ్డ, పాడైనరోడ్లు) రోడ్లను పునర్మాణం చేయాలని,
ఏజెన్సీ గిరిశిఖర మారుమూల గ్రామాలకు లింకు రోడ్లు వేసి,  డోలి సమస్యను పరిష్కరించాలని,

19.ఏజెన్సీ లో ఉన్న ప్రాథమిక ఆసుపత్రులకు, డాక్టర్ లను, సిబ్బందిని నియమించి, సరిపడా మందులు సరఫరా చేయాలి.

20.సాగునీటికి, త్రాగునీటికి
అత్యవసరమయ్యే జంఝావతి, జంపర్లకోట, తదితర పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలనీ,

21.పూర్ణపాడు-లాబేసు వంతెన, అడారు గెడ్డ వద్ద వంతెన తదితర పెండింగ్ లో ఉన్న వంతెనలు పూర్తిచేయాలనీ,

22.సంక్షేమ వసతి గృహల్లో( బాత్రూములు, భోజనం, బట్టలు బిల్డింగ్ లు) మౌళిక సదుపాయాలు కల్పించాలని,,
పర్మనెంట్ ANM లను నియమించాలని,,

23.యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోసం పరిశ్రమలు
నిర్మించాలనీ,

24.అసంపూర్తి నిర్మాణంలో  ఉన్న ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనములో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలినీ,

25.ఆస్తి,ప్రాణ,పంటలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళన గురి చేసే   ఏనుగులను “జూ” కు గాని, అడవికి గాని తరలించాలి. కుంకీ ఏనుగులు తెప్పించి సమస్యకు పరిష్కారం చూపించాలి.

26. నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం 8500 ఎకరాలు కర్రేడు భూములను విశ్వేశ్వర్ రెడ్డి సోలార్ ప్రాజెక్టుకు ఇవ్వటాన్ని  ఈ సదస్సు ఖండిస్తున్నది.

27. రాష్ట్రంలోని  ప్రభుత్వమెడికల్ కళాశాలలను  పి పి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం  కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నాలను  ఉపసంహరించుకోవాలని సదస్సు తీర్మానం చేస్తున్నది.

28. అదేవిధంగా ఇటీవల అసెంబ్లీ 13 గంటల పని విధానాన్ని చట్టబద్ధం చేయటానికి సదస్సు తీవ్రంగా ఖండిస్తున్నది. రాత్రిపూట మహిళలను పనిలో అనుమతించటాన్ని ఈ సదస్సు ఖండిస్తున్నది.

29. కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీలపై, విప్లవకారులపై సాగిస్తున్న ఎన్కౌంటర్ హత్యలను ఆపాలి.గిరిజనులు జీవించే హక్కును హరించి వేస్తూ అటవీ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులను పెట్టుబడుదారులకు అప్పగించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖిరులను ఈ సదస్సు ఖండిస్తున్నది.

సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫాసిస్టు వ్యతిరేక ” రాష్ట్ర సదస్సు” డిమాండ్ చేస్తున్నది.

Related Posts

0 comment

Leave a Comment