Home » పూర్ణపాడు-లాబేసు వంతెన ఎప్పుడు పూర్తి చేస్తారు?

పూర్ణపాడు-లాబేసు వంతెన ఎప్పుడు పూర్తి చేస్తారు?

by admin

ప్రెస్ నోట్: 22-09-2025
కలెక్టరేట్: పార్వతీపురం

పూర్ణపాడు-లాబేసు వంతెన ఎప్పుడు పూర్తి చేస్తారు?

కామ్రేడ్ తోట జీవన్న
జిల్లా కార్యదర్శి,
సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్,
డిమాండ్,

పూర్ణపాడు లాబేసు వంతెన యొక్క పెండింగ్ పనులు పూర్తిచేసి ప్రజా రవాణాకి మార్గం చూపాలని సిపిఐ
(ఎమ్ ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేసారు.
సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, బొత్స మోహన్ రావు లతో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ మండలమైన నాగావలి నది పై వంతెన నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు.1996లో అటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర సరిహద్దు గ్రామమైన వనిజ గ్రామం వద్ద జరిగిన పడవ ప్రమాదం లో సుమారు 36మంది చనిపోవడముతో అప్పటికి అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం వంతెన కడతామని హామీ ఇచ్చింది. 2006 వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అప్పుడు 2006 లో అంచనా ప్రకారం 3కోట్ల 50లక్షలతో మూడు పిల్లర్లతో ప్రారంభమై ఇప్పటికి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నదనే సామెత లాగా పనులు నిలిచిపోయాయి. ఇవతల జిల్లా నుండి అవతల గ్రామాలకు కొట్టు, తొడుగురాయిపురం, తులసవలస, బంధవలస, తాడంగ వలస, పూజారి గోడ, కుంభకోట, రావికోన, కర్లగండ, పాలెం, చెక్కవలస, మాదలింగి, తదితర గ్రామాలకు కష్ట సుఖాలుకు, జిల్లా కేంద్రంనకు ఆఫీస్ పనులుకు గాను, చికిత్స కోసం ఆసుపత్రులకు పోవడానికి వంతెన లేకపోవడముతో సుమారు 50 కిలోమీటర్లు చుట్టూ తిరిగిరావడం జరుగుతుంది అన్నారు. నది పై వంతెన లేకపోవడం ఈ ప్రాంత ప్రజల కష్టాలు వర్ణాతీతం.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్ణపాడు లాభేసు వంతెన కడతామని హామీ ఇచ్చినప్పటికీ కూడా గెలిచిన తర్వాత 15 నెలలు అయినా కనీసం ఈ వంతెన వైపు చూడలేని పరిస్థితి. అమరావతికి కోట్లాది డబ్బులు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో పూర్ణపాడు- లాభేసు వంతెన కోసం కనీసం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నదని అన్నారు.
కలెక్టర్ గారు స్పందించి కొమరాడ మండలానికి 9పంచాయతీలు, 42గ్రామాల ప్రజల రాకపోకల సమస్య అయిన పూర్ణపాడు-లాబేసు పై వంతెన పూర్తి కొరకు చర్యలు తీసుకొని, ప్రజా రావణాకు సహకరించాలని ఆ మెమోరాండంలో తెలియపరిచాము.

Related Posts

0 comment

Leave a Comment