Home » అధికారుల నిర్లక్ష్యంతో మరో విద్యార్థి మృతి.

అధికారుల నిర్లక్ష్యంతో మరో విద్యార్థి మృతి.

by admin

పత్రికా ప్రకటన

పార్వతీపురం,
సిపిఐ (ఎల్ ఎల్) రెడ్ స్టార్
జిల్లా కార్యాలయం
15-10-2025.

అధికారుల నిర్లక్ష్యంతో మరో విద్యార్థి మృతి.

సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్
జిల్లా కార్యదర్శి తోట జీవన్న,

* గిరిజన గురుకుల సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న గిరిజన విద్యార్థులు అనారోగ్యంతో పిట్టల రాలిపోతున్న అధికారుల నిర్లక్ష్యంతో మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయిందని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న అన్నారు,
* ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న అన్నారు
కురుపాం గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన తరువాత విద్యార్థులు మరణాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోని ప్రభుత్వాలు.*
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గం లో మరో ఘటన.
ఏఎన్ఎమ్ ల నియామకం చేపట్టాలి.
ఈరోజు పార్వతీపురంలో మీడియాతో మాట్లాడుతూ,,
మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారి (పనసభద్ర పంచాయతీ మూల వలస గ్రామం) అనే విద్యార్థి పచ్చకామర్లతో మరణించాడు. ఆ విద్యార్థికి ఒంట్లో బాలేదని ఇంటికి తీసుకు వెళ్లండి అని తల్లిదండ్రులతో ఈనెల 13వ తారీఖున టీచర్స్ ఫోన్ చేసి చెప్పడంతో ఆ విద్యార్థిని హడావిడిగా సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి విజయనగరానికి తీసుకువెళ్లినా డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పడంతో కేజీహెచ్ కు తరలిస్తున్న మార్గం మధ్యలో విద్యార్థి చిన్నారి ఈరోజు (15 వ తారీఖు) ఉదయం మృతి చెందాడు. జిల్లాలోని హాస్టల్స్ లో విద్యార్థులు పచ్చకామర్లు బారిన పడుతున్నారు అని తెలిసిన తరువాత కూడా మిగిలిన అన్ని హాస్టల్స్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా ఈ విద్యార్థి మృతి చెందాడు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యార్థితో కలిపి 17 మంది విద్యార్థులు మరణించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపించాలి అన్నారు. కురుపాంలో నీరు కలుషితం అవడం వలన దాదాపు 200 మంది విద్యార్థులు హాస్పటల్ పాలై ఇద్దరు విద్యార్థినులు మరణించిన తర్వాత కూడా విద్యార్థుల మరణాలను నివారించడానికి గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వాలు తీసుకోవలసిన జాగ్రత్తలను తీసుకోలేదు. దీని ఫలితంగా మరో విద్యార్థి బలయ్యాడు. హాస్టల్ కు తీసుకువెళ్లి జాయిన్ చేసే ముందు పిఓ గారి ఆదేశాల మేరకు సంబర పిహెచ్సిలో ఈనెల 8వ తారీఖున టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్ వచ్చిందని వెంటనే పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రాత్రి 9 గంటలకు తరలిస్తే అక్కడ కనీసం వైద్యం అందించకుండా టెస్టులు నిర్వహించకుండా ఏమీ లేదని చెప్పి మరుసటి రోజు అనగా పదవ తారీకు ఉదయం 10 గంటలకు డిస్చార్జ్ చేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఏ సమస్య లేదు కదా అని హాస్టల్లో జాయిన్ చేస్తే తిరిగి ఇంటికి ఇలా విగత జీవిగా వచ్చాడని అన్నారు. ఇప్పుడు మలేరియా వల్ల కాదు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు అని అంటున్నారు అంత చిన్న పిల్లవాడికి కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పార్వతీపురం హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని కాబట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఎర్రసామంతవలస హాస్టల్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా పాడైపోయిందని విద్యార్థులు మరణించేంతవరకు వాటిని బాగు చేయరా అని ప్రశ్నించారు. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికలలో 58 ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం లను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమయిందని అన్నారు. ఇప్పటికైనా ఏఎన్ఎమ్ లను భర్తీ చేయాలని, అన్ని ఆశ్రమ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ఈ మరణాలకు కారణమవుతున్న పరిశుభ్రమైన త్రాగునీరు , పౌష్టికాహారం లేకపోవడం, హాస్టల్స్ లో అపరిశుభ్రమైన పరిసరాలు, పిల్లలు నిద్రించే గదిలోనే భోజనాలు పెట్టడం, పిల్లలకు సరిపడినన్ని గదులు లేకపోవడం, తలుపులకు కిటికీలకు మెస్ లు లేకపోవడం, కేర్ టేకర్లన ఏర్పాటు చేయకపోవడం, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం లో నియమించడం, మంత్లీ హెల్త్ చెకప్ లు నిర్వహించక పోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు కాంపెన్సేషన్ గా రెండు ఎకరాల భూమి ప్రకటించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాల, అన్ని హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నవారు, సిపిఐ ఎమ్ ఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య బిడ్డకు రామమూర్తి,బొత్స మోహన్ రావు, హరినాన సీతమ్మ గుజ్జ జనార్ధన,యువజన సంఘం నాయకులు బిడ్డికి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు,,

Related Posts

0 comment

* * * $3,222 deposit available * * * hs=0dd60d72bc302cb4357f2b831b14e3aa* ххх* January 14, 2026 - 6:26 am Your comment is awaiting approval

csw136

Reply

Leave a Comment